Site icon NTV Telugu

RAPO 22 : ఆంధ్ర కింగ్ తాలూకా ఈవెంట్ క్యాన్సిల్

Akt

Akt

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. మహేష్ బాబు. పి  దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. హీరోగా రామ్ కెరీర్ లో ఆంధ్రా కింగ్ తాలూకా 22వ సినిమా.

ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలానే రామ్ స్వయంగా రాసిన నువ్వుంటే చాలే ఫస్ట్ సింగిల్ కు కూడా భారీ స్పందన తెచ్చుకుంది. ఆంధ్ర కింగ్ తాలూకా నుండి మరొక సాంగ్ ను ఈ నెల 31న ఈ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్  చేసారు మేకర్స్. ఈ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించాలని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు టీమ్. కానీ ఇటీవల ఏపీలో సంభవించిన మెంథా తుఫాను కారణంగా వైజాగ్ లో తీవ్రమైన గాలి, వరదలు రావడంతో ఎక్కడికక్కడ వరదనీరు నిలిచింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఈవెంట్ చేయడం కరెక్ట్ కాదని భావించి సాంగ్ లాంఛ్ కార్యక్రమాన్ని రద్దు చేసారు. హైదరాబాద్ లో ఈవెంట్ చేసి రిలీజ్ చేద్దామా లేక డైరెక్ట్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేద్దామా అనే ఆలోచనలు చేస్తున్నారు టీమ్. రామ్ కెరీర్ లో భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబరు 28న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు వివేక్ శివ, మెర్విన్ సోలో మన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version