Site icon NTV Telugu

Bridge Collapse: కూలిన కాగజ్‌నగర్ అందెవెల్లి బ్రిడ్జి

Birdge 2

Birdge 2

భారీవర్షాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రిడ్జిలు, కాజ్ వేలు బాగా దెబ్బతిన్నాయి. తెలంగాణలోని కొమురం భీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో అందెవెల్లి బ్రిడ్జి కూలిపోయింది. గత వర్షాలకు పెద్ద వాగు ఉధృతికి దెబ్బతింది కాగజ్ నగర్ మండలం లోని అందెవెల్లి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి ప్రమాదకరంగా వుందని గతంలో అధికారులకు తెలిపారు గ్రామస్తులు. దీంతో బ్రిడ్జి ప్రమాదపు అంచుకు చేరుకోవడంతో గతంలోనే రాకపోకలను నిలిపి వేశారు అధికారులు.

అప్రోచ్ రోడ్డు నుండి 3 వ పిల్లర్ వరకు బ్రిడ్జి నేలమట్టం అయింది. రాత్రి సమయంలో కూలడంతో ఘోర ప్రమాదం తప్పింది.అధికారులు స్పందించి బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read Also:Chess Championship: చెస్ ఛాంపియన్ షిప్ నుంచి తెలుగమ్మాయి బహిష్కరణ

Exit mobile version