Site icon NTV Telugu

Anchor Suma: రజాకర్ మూవీ పై సుమ రివ్యూ.. గుండె ముక్కలైంది అంటూ పోస్ట్..

Sumaaa

Sumaaa

రజాకార్ సినిమా ఇప్పుడు థియేటర్లో బాగానే ఆడేస్తోంది. నిజాం కాలంలో హైదరాబాద్ లో ఇంత దారుణాలు జరిగాయా అంటూ ఎమోషనల్ అవుతున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే గుండె బరువెక్కిస్తుందని జనాలు చెబుతున్నారు.. మొదట్లో విమర్శలు అందుకున్నా కూడా ఇప్పుడు సినిమా ను చూసి విమర్శకులు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది..

ఇకపోతే ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ సినిమాను చూసినట్లు లేరు.. అందుకే ఏ ఒక్కరు కూడా సినిమా పై స్పందించలేదు.. కానీ యాంకర్ సుమ ఈ సినిమాను చూసేసినట్లు ఉంది.. ఈ సినిమా పై ఇంట్రెస్టింగ్ రివ్యూను పంచుకుంది.. సుమ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. సినిమాలను ఎక్కువగా చూస్తుంటుంది.. తన నచ్చిన సినిమాల పై రివ్యూను అభిమానులతో పంచుకుంటుంది.. ఈ సినిమా పై కూడా తన అభిప్రాయాన్ని పంచుకుంది..

ఈ సినిమాను చూస్తుంటే గుండె ముక్కలైంది.. హైద్రాబాద్ సంస్థాన స్వతంత్ర పోరాటాన్ని చక్కగా చూపించారు.. ఇలాంటి సినిమాను తీసిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా బాగా నటించారు.. ఇలాంటి సినిమాలు తియ్యాలంటే భారీ బడ్జెట్ తో పాటు ధైర్యం కావాలి.. నిజంగా చాలా బాగుంది అంటూ ట్వీట్ చేసింది.. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Exit mobile version