బుల్లితెర జేజేమ్మ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అంతగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతారు….. ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తున్నారు.. సుమ తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సుమ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది..
ఎంత పెద్ద హీరో అయిన సుమకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు.. ఒక యాంకర్ కు ఈ మాత్రం క్రేజ్ రావడం అంటే మామూలు విషయం కాదు.. ఈ వయసులో కూడా అస్సలు తగ్గలేదు.. గ్లామర్, ఫిట్ నెస్ విషయంలో కూడా ఎక్కడ తగ్గలేదు.. ఇక ట్రెండీ వేర్ లో సుమ ఫోటో షూట్స్ చేయడం కొసమెరుపు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా సుమ ఒక ఆసక్తికర వీడియో షేర్ చేసింది.. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది..
ఉగాది పండుగకు సుమ డైట్ ను పక్కన పెట్టి పులిహోర, పొంగలి, గారెలు, పాయసం గట్టిగా లాగించాను. అవన్నీ కరిగించడానికి ఈ వ్యాయామం అని సుమ అన్నారు. అంతేకాదు ఆ వీడియోకు పండగ తర్వాత ప్రాయశ్చిత్తం ఇలా ఉంటుందని క్యాప్షన్ పెట్టింది.. ఆ వీడియోను చూసిన వారంతా షాక్ అవుతున్నాయి.. ఈ వయస్సు లో ఇంత కష్టం ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఆ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది..