Site icon NTV Telugu

Shiva Jyothi : నా ప్రెగ్నెన్సీపై అడ్డమైన వాగుడు ఆపండి.. ట్రోలర్స్‌కు శివజ్యోతి స్ట్రాంగ్ వార్నింగ్!

Shivajyothi

Shivajyothi

బిగ్‌బాస్ బ్యూటీ, పాపులర్ యాంకర్ శివజ్యోతి (తీన్మార్ సావిత్రి) త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లైన పదేళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, గత కొద్దిరోజులుగా ఆమె ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. శివజ్యోతి సహజంగా కాకుండా ఐవీఎఫ్ (IVF) లేదా ఐయూఐ (IUI) పద్ధతుల ద్వారా గర్భం దాల్చిందని, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు థంబ్‌నెయిల్స్‌తో తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ వార్తలు శివజ్యోతి దృష్టికి వెళ్లడంతో ఆమె తీవ్రంగా స్పందించి, ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.

Also Read : Anil Ravipudi: వైరల్ కావాల్సిన డైలాగ్ మిస్ అయిందా? అనిల్ రావిపూడి షాకింగ్ రివీల్

తమకు పెళ్లై పదేళ్లు అయినా, వ్యక్తిగత కారణాల వల్ల 2023 వరకు పిల్లల గురించి ఆలోచించలేదని శివజ్యోతి స్పష్టం చేశారు. “మేము ప్లాన్ చేసుకున్నప్పటి నుండి రెండున్నరేళ్లు ఎన్నో ఆసుపత్రులు తిరిగాము, చెట్ల మందులు వాడాము, మొక్కులు మొక్కుకున్నాము. చివరికి ఆ వేంకటేశ్వర స్వామి వ్రత ఫలితంగానే నేను సహజంగా గర్భం దాల్చాను. ఒకవేళ ఐవీఎఫ్ చేయించుకున్నా అది తప్పేమీ కాదు, ధైర్యంగా చెబుతాను. నా శరీరం నా ఇష్టం, నాకు నచ్చినప్పుడే తల్లి కావాలని నిర్ణయించుకున్నాను” అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం తాను ఏడు నెలల గర్భవతినని, రిపోర్టుల గురించి డాక్టర్ల సూచన మేరకే బయట పెట్టలేదని చెబుతూ.. అసత్య ప్రచారాలు చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version