బుల్లితెర లెజండరీ మేల్ యాంకర్స్ లలో ఒకరు ప్రదీప్ మాచిరాజు.. యాంకర్ సుమ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు.. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ త్వరలో పెళ్లి చేసకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.. గత కొన్నేళ్లుగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ప్రదీప్ జిమ్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది..
బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ముందున్నాడు మాచిరాజు ప్రదీప్. యాంకర్ గా మనోడు స్టార్. ప్రదీప్ వేసే పంచులకు పగలబడి నవ్వడంతో పాటు.. అమ్మాయిలు ఇంప్రెస్ అయ్యి.. పడిపోతుంటారు. ప్రదీప్ పెళ్లి గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. కాని అవేవి నిజం కాలేదు. ఇంకా వస్తూనే ఉన్నాయి. కాని మనోడు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడు.. ? అసలు చేసుకుంటాడా.? అనే సందేహాలు కూడా చాలా మందికి వస్తుంటాయి…
యాంకర్ ప్రదీప్ తాజాగా జిమ్ లో కష్ట పడుతున్న వీడియో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతుంది.. అతని కొత్త లుక్ చూసి షాక్ అవుతున్నారు.. కండలు తిరిగిన బాహుబలిగా కనిపిస్తున్నాడు.. కష్టపడుతూ వర్కవుట్స్ చేస్తున్న వీడియోను అతడి జిమ్ ట్రైనర్ నెట్టింట షేర్ చేశాడు. రింగుల జుట్టు.. కండలు తిరిగిన దేహంతో కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.. మరో సినిమా కోసం ట్రై చేస్తున్నారేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి అతని న్యూ లుక్ అదిరిపోయిందిగా..