NTV Telugu Site icon

Anasuya Bharadwaj : టీవీ షోలో మెరిసిన అనసూయ.. మళ్లీ యాంకరింగ్ చేస్తుందా?

Anasuya2

Anasuya2

బుల్లి తెర పై ఒకప్పుడు స్టార్ యాంకర్ గా దూసుకుపోయిన ముద్దుగుమ్మ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే.. యాంకరింగ్ కు దూరం అయిన అనసూయ చాలా కాలంగా బుల్లితెర కు దూరంగా ఉంటుంది.. కేవలం సినిమాల్లో మాత్రమే మెరుస్తూ పాపులారిటిని సొంతం చేసుకుంది… తెలుగుతో పాటుగా పలు భాషల్లో కూడా సినిమాల్లో నటిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా బుల్లితెర పై మెరిసింది.. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..

ప్రముఖ ఛానెల్ లో ‘స్టార్ మా’ ఛానల్ సరికొత్త గేమ్ షో స్టార్ట్ చేసింది. ఈ నెల 28 నుంచి ‘కిరాక్ బాయ్స్ – ఖిలాడీ గర్ల్స్’ షో మొదలు పెడుతోంది. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి ఆ షో టెలికాస్ట్ కానుంది. ఇంతకీ, ఆ షోలో ఎవరెవరు ఉన్నారో తెలుసా?.. బాయ్స్ ప్రతినిధిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జ్ సీటులోకి వస్తే… గర్ల్స్ ప్రతినిధిగా జడ్జ్ సీటులోకి అనసూయ భరద్వాజ్ వచ్చారు.. అంటే బుల్లితెర పై మళ్ళీ అను రీ ఎంట్రీ ఇచ్చిందనే తెలుస్తుంది…

ఈ షోలో అనసూయ అస్సలు తగ్గట్లేదు.. ఆ షో లో రెచ్చిపోయ్యింది.. ఈ షోకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో అనసూయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. షో మొత్తానికి తనే హైలెట్ అయ్యింది.. ఇక ఈ షోలో తన బ్లేజర్ ను తీసేయ్యడం పెద్ద చర్చగా మారింది.. ఒకవైపు పుష్ప 2 సినిమాలో నటిస్తూనే మరోవైపు బుల్లి తెర పై మళ్ళీ పాగా వేసేందుకు రెడీ అవుతుంది.. ఆ ప్రోమో వీడియో పై ఓ లుక్ వేసుకోండి..

Show comments