NTV Telugu Site icon

Anasuya : అనసూయ లేటెస్ట్ లుక్స్ అదుర్స్.. హేటర్స్ కోసమే క్యాప్షన్ పెట్టిందా?

Anu

Anu

అనసూయ.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ఒకప్పుడు యాంకర్ గా రాణించిన ఈ అమ్మడు ఇప్పుడు నటిగా విభిన్న పాత్రల్లో నటిస్తుంది.. నటిగా కూడా బాగా పాపులారీటినీ సొంతం చేసుకుంది.. ప్రస్తుతం భారీ ప్రాజెక్టు లలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా అదిరిపోయే స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది.. దానికి అదిరిపోయే క్యాప్షన్ కూడా ట్యాగ్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది.. గతంలో జబర్దస్త్ షో లాంటి షోలతో బాగా ఫెమస్ అయ్యింది.. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేవలం నటిగా మాత్రమే బిజీగా ఉంది.. తాజాగా అను క్యూట్ అండ్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

అంతేకాదు నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.. నేను మిమ్మల్ని ప్రేమించగలను అంటూ పెట్టింది. తనని ట్రోల్ చేసే హేటర్స్ కోసమే అనసూయ ఈ క్యాప్షన్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. సినిమాల విషయానికొస్తే.. అనసూయ చివరగా పెదకాపు, విమానం, రజాకార్ లాంటి చిత్రాల్లో నటించింది.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తుంది..

Show comments