NTV Telugu Site icon

Anasuya : డీప్ బ్లౌజ్ లో ఇబ్బంది పడిన అనసూయ..

Whatsapp Image 2023 11 17 At 9.42.36 Am

Whatsapp Image 2023 11 17 At 9.42.36 Am

అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే తన హాట్ ఫొటోస్ ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బుల్లితెరకు అనసూయ దూరమైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో, వెండితెరపై కనిపిస్తూ తన ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉంది.వెండితెర పై విభిన్న పాత్రలలో నటించి మెప్పిస్తుంది. తనకు వచ్చే పాత్రల విషయంలో అనసూయ ఎలాంటి నియమాలు పెట్టుకో లేదు. తాను చేసేది బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది.రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటించి మెప్పించింది.. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండేది. కానీ సినిమాలో తన పాత్ర నచ్చితేనే నటించడానికి ఒప్పుకుంటుంది.లేడి ఓరియెంటెడ్ చిత్రం అయినా కూడా ఆమె నటిస్తోంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ ఈ సమ్మర్ ని ఫ్యామిలీ కోసం డేడికేట్ చేసింది. వరుసగా వెకేషన్స్, టూర్లతో ఎంజాయ్ చేస్తోంది.అనసూయ తరచుగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, ఇతర ప్రకటనలతో బిజీగా ఉంటారు. అనసూయ తాజాగా ఓ షాపింగ్ మాల్ వాణిజ్య కార్యక్రమం కోసం రాయచోటి వెళ్లారు. దీనితో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది.అనసూయ కూడా జనాల్ని ఆకట్టుకునే విధంగా వెరైటీ బ్లౌజ్ లో కనిపించి ఆకట్టుకుంది.బ్లౌజ్ మరీ డీప్ గా ఉండడంతో ఆనసూయ కాస్త ఇబ్బంది పడుతూ కనిపించింది. అయినప్పటికీ అక్కడ అభిమానులతో సెల్ఫీలను తీసుకుంది.ఈ క్రమంలో మీడియాతో అనసూయ మాట్లాడుతూ పుష్ప ది రూల్ చిత్ర విశేషాలు పంచుకుంది. పుష్ప టీం గా మేమంతా చాలా కష్టపడుతున్నాం. మాకంటే అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ మరియు కెమెరా మెన్ లదే ఎక్కువ కష్టం ఉంటోంది అని అనసూయ పేర్కొంది.పుష్ప 2 మీరు ఊహించినదానికంటే ఎంతో భిన్నంగా ఉంటుందని అనసూయ తెలియజేసారు..