బుల్లితెరపై యాంకర్ గా ఎంతగానో అలరించిన అనసూయ ప్రస్తుతం బుల్లితెర కు దూరం గా వుంటూ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ భామ వరుసగా బిగ్ మూవీస్ లో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు చేస్తూ నటి గా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ‘రంగస్థలం’ సినిమా లో రంగమ్మత్త పాత్ర తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఆ తరువాత ‘పుష్ప’ సినిమా లో కాత్యాయని గా నటించి ఆకట్టుకుంది..మంచి పాత్ర లభిస్తే నటించేందుకు ఎప్పుడూ రెడీ గా ఉంటుంది ఈ భామ.ఓవైపు గ్లామర్ షో చేస్తూనే, మరోవైపు నటన తో కూడా రానిస్తుంది.. ఈ ఏడాది ఆమె నటించి పలు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ‘మైఖేల్’, ‘రంగమార్తాండ’,’ విమానం’, ‘పెదకాపు 1’, మరియు ’ ప్రేమ విమానం’ లాంటి చిత్రాలతో అందరినీ ఆకట్టుకుంది.ప్రస్తుతం అనసూయ ‘పుష్ప 2‘ సినిమా లో నటిస్తోంది.
సినిమాలతో ఎంత బిజీ గా ఉన్నా, సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పడు తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసి నెటిజన్లను ఆకట్టుకుంటుంది..మోడ్రన్ డ్రెస్సులతో పాటు సంప్రదాయ దుస్తుల్లోనూ అందాలు ఆదరబోస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది..తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టిందో అనేది తెలియడంలేదు.తన మర్యాద కు భంగం కలిగించిన వాళ్లను దూరం పెట్టడమే మంచిదని భావిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. ఇక నుంచి వాదనల కు దూరం గా ఉంటానని చెప్పుకొచ్చింది. ఎవరేం మాట్లాడినా పట్టించుకోనని తేల్చి చెప్పింది. ‘‘ఎడబాటే అగౌరవానికి నా సమాధానం. ఇకపై నేను అస్సలు స్పందించను.ఎవరి తో వాదన కు దిగను.. సింపుల్ గా కలవడం మానేస్తా’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట బాగా వైరల్ అవుతుంది.. ఈ పోస్టు పై నెటిజన్లు రకరకాలు గా స్పందిస్తున్నారు
