అనసూయ భరద్వాజ్ ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. బుల్లితెరపై యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది ఈ భామ. జబర్దస్త్ కామెడీ షో తో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ తో ఈ భామ బాగా పాపులర్ అయింది. ఆ సినిమా తరువాత వరుస సినిమాల ఆఫర్స్ వచ్చాయి. దీనితో యాంకరింగ్ ను వదిలేసి ప్రస్తుతం నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీ గా గడుపుతోంది. కాగా సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న అనసూయ.. ఈ ఏడాది మైఖేల్, రంగమార్తాండ మరియు విమానం వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది.ఈ సినిమాలు మంచి సక్సెస్ ని సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.. ఇప్పుడు ఈ భామ పుష్ప 2తో పాటుగా పలు చిత్రాల్లో నటిస్తోంది.
సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. అయితే నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎక్కువగా హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ భామ.అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండతో ఎప్పటినుంచో సాగుతున్న వివాదాన్ని ముగించింది.అలాగే అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది. అంతేకాదు తన ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ట్రిప్‌లకు కూడా వెళ్తోంది. అక్కడ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలు మరియు వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది.అయితే ఇదంతా చూసిన నెటిజన్స్ అనసూయ బిహేవియర్ లో చేంజ్ కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే అనసూయ తాజాగా మరో కొత్త వీడియోను కూడా పోస్ట్ చేసింది.అందులో తనలో వచ్చిన మార్పులను గురించి తెలియజేసింది.. నా మైండ్ సెట్ మారిపోయింది. నా ప్రాధాన్యతలు,అభిరుచులు అన్ని మారాయి. నేను సహనంగా ఉండటాన్ని అలవర్చుకుంటున్నాను అని తెలియజేసింది.
