Site icon NTV Telugu

Anasuya : ఆ కారణంగా హీరోయిన్ అవకాశాలను కోల్పోయాను..

Whatsapp Image 2023 11 04 At 7.19.15 Pm

Whatsapp Image 2023 11 04 At 7.19.15 Pm

అనసూయ భరద్వాజ్ .. జబర్దస్త్ షో తో యాంకర్‌గా ఫుల్ పాపులర్ అయ్యారు. టాప్ యాంకర్ గా ఎంతగానో మెప్పించారు..అయితే, ఆమె ప్రస్తుతం యాంకరింగ్‍కు గుడ్‍బై చెప్పి సినిమాలపైనే పూర్తి దృష్టి సారించారు.పలు సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ఎంతగానో మెప్పిస్తున్నారు. అయితే, కెరీర్ మొదట్లో తనకు హీరోయిన్‍గా అవకాశాలు ఎందుకు రాలేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ చెప్పుకొచ్చారు… హీరోయిన్ అవకాశాలను తాను ఎందుకు కోల్పోయిందో కూడా వివరించారు. అత్తారింటికి దారేది సినిమా విషయంలో దర్శకుడు త్రివిక్రమ్‍కు క్షమాపణ చెప్పినట్టు కూడా ఆమె వెల్లడించారు.సినిమాల షూటింగ్ పూర్తయ్యాక జరిగే పార్టీలకు తాను వెళ్లేదాన్ని కాదని అనసూయ తెలిపారు.. దీనివల్ల తాను హీరోయిన్ అవకాశాలను కోల్పోయానని ఆమె అన్నారు. కొన్నిసార్లు పార్టీలకు వెళ్లినా కూడా అవి తనకు సూట్ కావని డిసైడ్ అయినట్టు ఆమె చెప్పారు. అలాగే, పార్టీలకు వెళితేనే హీరోయిన్‍గా అవకాశాలు వస్తాయంటే వాటిని తాను అస్సలు ప్రోత్సహించనని కూడా అనసూయ అన్నారు.గతంలో అత్తారింటికి దారేది సినిమాలో ఓ పాట కోసం అనసూయకు అవకాశం వచ్చిది . అయితే, దాన్ని ఆమె తిరస్కరించారు.

దీంతో అప్పట్లో పవన్ కల్యాణ్ అభిమానులు కొందరు అనసూయను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.ఆ విషయం తెగ వైరల్ అయింది. ఆ విషయంపై కూడా తాజాగా ఈ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడారు. అప్పటికే ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారని, గుంపులో ఒకరిగా నటించడం నాకు ఇష్టం లేకే ఆ అవకాశాన్ని వదులుకున్నాని అనసూయ చెప్పారు.”అత్తారింటికి దారేది అవకాశాన్ని తిరస్కరించినప్పుడు నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. నేను తిరస్కరించడం తప్పు కాదు.. కానీ చెప్పే విధానం సరికాదేమో అని అయితే అనిపించింది. కాస్త గట్టిగా చెప్పానేమో అని అనుకున్నా. అందుకే దర్శకుడు త్రివిక్రమ్‍ గారికి సారీ చెప్పా” అని అనసూయ తెలిపారు.తన భర్త తనకు పూర్తిగా స్వేచ్ఛను ఇ చ్చారని అనసూయ తెలిపారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన కామెంట్స్ పెట్టే వాళ్ల ఇళ్లలో మహిళలను తలచుకుంటే మాత్రం జాలేస్తోందని కాస్త ఘాటుగానే ఆమె మాట్లాడారు. తన సోషల్ మీడియా పోస్టులతో కొందరు నన్ను విమర్శిస్తున్నా కానీ స్ఫూర్తి పొందే వాళ్లు కూడా ఉన్నారని అనసూయ తెలిపారు

Exit mobile version