NTV Telugu Site icon

Ananya Nagalla : కర్ర సాముతో అదరగొడుతున్న అనన్య.. వీడియో వైరల్..

Ananya Nagalla

Ananya Nagalla

Ananya Nagalla : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ మల్లేశం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమాలో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది.ఆ తరువాత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఆ సినిమాతో ఈ భామకు మంచి గుర్తింపు వచ్చింది.ఆ తరువాత ఈ భామకు వరుస సినిమా ఆఫర్స్ వచ్చాయి.అయితే అప్పటి వరకు పద్దతిగా కనిపించిన ఈ భామ ఆ తరువాత గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా వుండే ఈ భామ హాట్ ఫోజులతో దిగిన ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Read Also :NTR : ఎన్టీఆర్ ప్లాప్ సినిమాని రీమేక్ చేస్తానంటున్న విశ్వక్ సేన్..

తాజాగా ఈ భామ నటించిన హారర్ మూవీ “తంత్ర”.గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.ఈ భామ ప్రస్తుతం పొట్టేలు అనే సినిమాలో నటిస్తుంది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉంటే అనన్య నాగళ్ళ కర్రసాము చేస్తున్న వీడియోని  సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.తన తరువాత సినిమాకోసం అనన్య ఇలా కర్రసాము నేర్చుకుంటుందేమో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.యాక్టింగ్ తో పాటు కర్రసాము అదరగొడుతున్నావ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments