అనంతపురంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ సందర్భంగా కొంతమంది వ్యక్తులు, సమూహాలు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఫేక్ న్యూస్ నమ్మకండి అని కోరారు అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప. అనంతపురం JNTU లో మూడవ రోజు కొనసాగుతోన్న కడప-అనంతపురము-కర్నూలు పట్టభద్ర ఎమ్మెల్సీ కౌంటింగు విషయంలో పుకార్లు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Read Also:Newly Elected MLCs Meet CM YS Jagan: సీఎంను కలిసి కొత్త ఎమ్మెల్సీలు.. అభినందించిన వైఎస్ జగన్
సోషల్ మీడియా వేదికగా ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు పుకార్లు వ్యాప్తి చేస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది టీడీపీ గెలిచిందని, కొందరు వైసీపీ గెలిచిందని తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యి ఫలితాలు వెల్లడయ్యేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశముంది. అందరూ సంయమనంతో ఉండాలి. వాస్తవాలు కాకుండా పుకార్లు వ్యాప్తి చేయడం వల్ల అలజడులు చెలరేగే వీలుందని గమనించాలి. కౌంటింగు యావత్తు ఎన్నికల నియమ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు.
Read Also: Minister KTR: ఇది ఇద్దరు దుర్మార్గులు చేసిన తప్పిదం.. పేపర్ లీకేజ్‌పై కేటీఆర్ స్పష్టత