NTV Telugu Site icon

Anant Ambani Pre-Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో సందడి చేసిన తారలు..

Annatha

Annatha

ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్నకొడుకు అనంత్ అంబానీ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. గుజరాత్ లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి.. ఈ వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు… ఇప్పటికే చాలా మంది అక్కడికి చేరుకొని సందడి చేస్తున్నారు.. ప్రతి కార్యక్రమానికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

బిల్‌గేట్స్‌, ఇవాంకా ట్రంప్‌ వంటి విదేశీ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో చివరి రోజు ట్రిపులార్‌ లోని నాటు నాటు పాటపై బాలీవుడ్‌ సూపర్‌ స్టార్స్‌ స్టెప్పులేసి అలరించారు. షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ డ్యాన్స్‌ చేశారు. అలాగే వేడుకల చివరి రోజు ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ క్లాసికల్‌ డ్యాన్స్‌ చేశారు.. ఆ డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంది.. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

అంతేకాదు రణ్‌బీర్‌-ఆలియా, దీపికా పదుకుణె-రణ్‌వీర్‌ సింగ్‌, కరీనా కపూర్‌-సైఫ్‌ తదితర బాలీవుడ్ జంటలు వేడుకల్లో డ్యాన్సులతో సందడి చేశారు. దీపికా పదుకుణె-రణ్‌వీర్‌ సింగ్‌ డ్యాన్స్‌ హైలైట్‌గా నిలిచింది. ప్రగ్నెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత ఈ జంట తొలిసారి ఇలా డాన్స్ చేస్తూ కనిపించి ఆకట్టుకున్నారు… సినీ ప్రముఖుల డ్యాన్స్ లు అందరిని తెగ ఆకట్టుకున్నాయి.. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు హాట్ టాపిక్ అయ్యాయి..