NTV Telugu Site icon

Folding House : ఈ ఇళ్లు ఎక్కడికైనా మడతపెట్టుకుని తీసుకువెళ్లొచ్చు

Boxabl Thumb

Boxabl Thumb

Folding House : ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఓ కల. ఎన్ని కష్టాలు ఉన్నా సొంత ఇంట్లో ఉంటే ఆ ధైర్యం వేరు. తినడానికి టైంకు ఆహారం లేకపోయినా ఫర్వాలేదు.. కానీ సొంతిల్లు ఉండాల్సిందే. అందుకే అందరూ ఎన్నో ఏళ్లు కష్టపడి ఇల్లు కట్టుకుంటారు. జీవితంలో ఒక్కసారి కట్టుకునే ఇంటికోసం ఎన్నో కలలు కంటారు. అందుకే ఆ ఇల్లంటే అంతలా ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో ఆ ఇంటిని విడిచి పెట్టాల్సిన పరిస్థితులు వస్తే వారి ప్రాణం పోతున్నట్లు భావిస్తారు. అంతలా ఇంటిలో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. అప్పటి వరకు అన్నేళ్లపాటు ఆ ఇంటితో అల్లుకున్న బంధాలు, జ్ఞాపకాలను మరిచిపోవడం అంటే అంత సులభం కాదు. అలాంటి వారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూస్తే ఈ బాధ తొలగిపోతుంది.

Read Also: 2023 New heroines: ఈ యేడాది అలరించబోతున్న కొత్త భామలు!

మీరు ఇల్లు మడత పెట్టి…నచ్చిన చోటికి తీసుకెళ్లి నిలబెట్టడం, ఇంట్లో గొడలు నచ్చినట్లు ఎలా కావాలంటే అలా మార్చుకోవడం ఎప్పుడైనా చూశారా? విన్నారా? ఇప్పుడు అలాంటి మడత ఇళ్లు రాబోతున్నాయి. కోరుకున్న చోటికి సులభంగా తీసుకెళ్లి నిమిషాల వ్యవధిలో ఏర్పాటు చేసుకోవడమే ఈ ఇంటి ప్రత్యేకత. దీన్ని ఫోల్డబుల్ హౌస్ గా చెబుతారు. 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టూడియో అపార్ట్ మెంట్ మాదిరిగా ఉంటుంది. చిన్న కుటుంబానికి సరిపోతుంది. దీని ధర 49,500 డాలర్లు. అంటే మన రూపాయిల్లో సుమారు రూ.40 లక్షలు .

Read Also: Kesineni Nani: నీతి, నిజాయితీ, క్యారెక్టర్ ఉన్న వాళ్లకి టికెట్‌ ఇవ్వండి..!

‘‘దీన్ని భారత్ లో మరిత చౌకగా తయారు చేయవచ్చు. విపత్తుల తర్వాత వేగంగా షెల్టర్ ఏర్పాటుకు ఈ నమూనా చక్కగా సరిపోతుంది. అందుబాటు ధరలకే ఇళ్లను అందించాలన్న మన సమస్యలకు ఆవిష్కరణలే సమాధానం అవుతాయి’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దీని పేరు బాక్సబుల్ ఫోల్డింగ్ హౌస్. ఈ చిన్ని ఇంట్లో ఒక ఓపెన్ కిచెన్, బెడ్ రూమ్, హాల్ ఉంటాయి. దీన్ని ఫోల్డ్ చేసి, కావాల్సిన చోట అన్ ఫోల్డ్ చేసుకోవడమే. మరిన్ని వివరాలను https://www.boxabl.com/ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు.

Show comments