యూఎస్ ట్రావెల్ వ్లాగర్ మాక్స్ మెక్ఫార్లిన్ లెన్స్ చూపించిన ఇండోర్ అసాధారణ పరిశుభ్రతను హైలైట్ చేస్తూ ఉన్న వీడియోను ఆనంద్ మహీంద్రా ఇటీవల ఓ వీడియోను పంచుకున్నారు. వైరల్ అయిన ఈ వీడియోలో, ఇండోర్లోని రోడ్డు పక్కన ఉన్న తినుబండారాల షాప్స్ సముదాయాన్ని చూపిస్తుంది. అక్కడ మాక్స్ నిర్వహించబడే అద్భుతమైన పరిశుభ్రత పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. మాక్స్ తన వ్లాగ్ లో వీక్షకులను తినుబండారాల పర్యటనకు తీసుకెళ్లడంతో అక్కడి పరిస్థితిని ఎత్తి చూపడంతో వీడియో ప్రారంభమవుతుంది.
Virat Kohli: ‘నా కళ్లను మాత్రమే నమ్ముకుంటా’.. విరాట్ సంచలన వ్యాఖ్యలు..
ఇక అక్కడి పరిసరాలను శుభ్రంగా ఉంచడం గురించి అక్కడి వారు ఎలా అప్రమత్తంగా ఉన్నారో ఆయన హైలైట్ చేస్తూ., ఉపయోగించిన స్టీల్ ప్లేట్స్ ను వేర్వేరు డబ్బాల్లో ఉంచారని., అక్కడ చేతులు కడుక్కోవడానికి ఒక చిన్న కొళాయి మాత్రమే అందుబాటులో ఉందని పేర్కొన్నారు. కాగితం, ప్లాస్టిక్ వాడకాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఎవరైనా అనుకోకుండా వీధిలో ఆహారాన్ని కింద పడేస్తే, వారు వెంటనే దానిని తీసి నియమించబడిన చెత్త బుట్టల్లో పారవేస్తారని మాక్స్ గమనించాడు.
Vijay Devarakonda : ఆ విషయంలో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు..?
ఇక ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా ఎక్స్ లో షేర్ చేస్తూ.., “కలలు కనకుండా ఉండలేము.. వీటిని దేశవ్యాప్తంగా ప్రతిరూపం చేస్తే.. ” అంటూ పోస్ట్ చేసారు. ఈ వీడియోతో ఇండోర్ పరిశుభ్రతను ప్రేక్షకులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ నగరం ఇప్పటికే భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందిందని అంటున్నారు. ఇండోర్ పరిశుభ్రత విజయం సమర్థవంతమైన పాలన, వారి నగర ప్రమాణాలను నిర్వహించడానికి అక్కడి ప్రజల నిబద్ధత రెండింటి ఫలితమని పేర్కొంటూ చాలా మంది వ్యాఖ్యలు చేశారు. ‘స్వచ్ఛ్ సర్వేక్షన్’ అవార్డులలో ఇండోర్ వరుసగా ఏడవ సారి పరిశుభ్రమైన నగర టైటిల్ ను గెలుచుకుంది.
Cannot help dreaming:
If this were to be replicated throughout the country… pic.twitter.com/PGkNSfYoA2
— anand mahindra (@anandmahindra) May 22, 2024