Epic Movie Glimpse: ఓటీటీలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న వెబ్‌సిరీస్ #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఇందులో నటించిన నటీనటులు ఎంతటి గుర్తింపు సొంతం చేసుకున్నారో తెలిసిందే. తాజాగా ఈ వెబ్ సిరీస్‌లోని పాత్రలతో ‘#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ ఆదిత్య హాసన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోహీరోయిన్లుగా ‘బేబీ’ సినిమాతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ – వైష్ణవీ చైతన్య కనిపించనున్నారు. వీళ్ల కాంబినేష్‌లో తెరకెక్కుతున్న ఈ కొత్త సినిమా టైటిల్‌ను సోమవారం చిత్ర బృందం ప్రకటిస్తూ గ్లింప్స్‌ను విడుదల చేసింది.
READ ALSO: Vande Mataram 150 Years: వందేమాతరం పై పార్లమెంట్ లో చర్చ.. 10 గంటలు కేటాయింపు
#90s వెబ్‌సిరీస్‌లోని పాత్రలతో రూపొందుతున్న ఈ సినిమా పేరు ‘ఎపిక్’ (Epic). సినిమా టైటిల్‌ను విడుదల చేస్తూ చిత్ర బృందం విడుదల చేసిన గ్లింప్స్‌లో ‘ఇది శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అంటూ ఆనంద్ చెప్పిన డైలాగ్ చిత్రంపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. నాకైతే పెళ్లి ఇష్టం లేదు కానీ పేరంట్స్ కోసం అయితే తప్పదు అంటూ హీరోయిన్ పలికిన సంభాషణలు, తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో హీరోయిన్ చెబుతున్నప్పుడు అదే టైంలో హీరోకు సంబంధించిన చిన్నప్పటి ఎలివేషన్ సీన్లు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
READ ALSO: Varun Sandesh: జీ5లో స్ట్రీమింగ్ కానున్న వరుణ్ సందేశ్ ‘నయనం’.. ఫస్ట్ లుక్ చూశారా
