NTV Telugu Site icon

Anand Deverakonda : గం.. గం…గణేశా నుండి స్పెషల్ అప్డేట్ అందించిన ఆనంద్ దేవరకొండ..

Whatsapp Image 2024 04 28 At 2.03.50 Pm

Whatsapp Image 2024 04 28 At 2.03.50 Pm

ఆనంద్ దేవరకొండ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు .రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా “దొరసాని” చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.ఆ సినిమా ప్రేక్షకుడిని అంతగా మెప్పించలేదు.ఆ తరువాత ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది .ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .ఆ తరువాత వచ్చిన పుష్పక విమానం సినిమాతో ఆనంద్ దేవరకొండ తన నటనతో ఎంతో ఆకట్టుకున్నాడు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు .ఆ తరువాత వచ్చిన “బేబీ” సినిమా ఆనంద్ దేవరకొండ సినీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించింది .ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించింది .యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా వున్నఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

ప్రస్తుతం ఆనంద్ దేవర కొండ నటిస్తున్న తాజా చిత్రం ‘గం..గం..గణేశా ..ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్‌ లుక్‌ మరియు మోషన్‌ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఆనంద్ దేవరకొండ చాలా రోజుల తర్వాత స్పెషల్ అప్డేట్ అందించాడు.త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటన రాబోతుందని ట్వీట్ చేశాడు. క్రైమ్ కామెడీ డ్రామా కోసం మేము కొన్ని సంవత్సరాల నుండి పని చేస్తున్నాము. మేకింగ్‌లో మాకు కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి, కానీ వాళ్లు చెప్పినట్లుగా ఇప్పుడు అంతా సవ్యంగా ముగుస్తుంది. సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. కామెడీ మరియు డ్రామా వినూత్న రీతిలో హ్యాండిల్‌ చేశామని ఆనంద్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.ఈ చిత్రాన్ని హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి మరియు వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఉదయ్‌ శెట్టి డైరెక్టర్‌గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తుంది .వెన్నెల కిషోర్ ,సత్యం రాజేష్ వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు
పోషిస్తున్నారు .