Apollo Quiboloy: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో పోలీసులు అపోలో క్విబోలాయ్ ను అరెస్టు చేశారు. క్విబోలాయ్ తనను తాను “దేవుని కుమారుడు”గా ప్రకటించుకున్నాడు. ఆయన ఓ యేసు క్రీస్తు రాజ్యం (KOJC) చర్చ్ పాస్టర్. రెండు వారాలకు పైగా సాగిన భారీ శోధన తర్వాత పోలీసులు క్విబోలాయ్‌ను అరెస్టు చేయగలిగారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు అపోలో క్విబోలాయ్ కు అనుచరులు. 74 ఏళ్ల క్విబోలాయ్‌పై పిల్లల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, మానవ అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నాయి.
Gold Rate Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతో తెలుసా?
ఇకపోతే ఆయన అపోలో క్విబోలాయ్ దక్షిణ ఫిలిప్పీన్స్‌లో జన్మించారు. క్విబోలోయ్ 1985లో కింగ్‌డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ (KOJC) అనే చిన్న మత సంస్థను స్థాపించారు. ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెందింది. అతి తక్కువ సమయంలోనే ఫిలిప్పీన్స్, 200 కంటే ఎక్కువ దేశాలలో లక్షలాది మంది అనుచరులను సంపాదించుకుంది. పెంటెకోస్టల్ క్రైస్తవ మతం అంశాలను క్విబోలోయ్ స్వీయ ప్రకటిత దైవిక హోదాతో మిళితం చేసిన KOJC, ఫిలిప్పీన్స్‌లో త్వరగా ఒక ప్రధాన శక్తిగా మారింది. ఈయన మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే “ఆధ్యాత్మిక సలహాదారు”గా పిలువబడేవాడు. ఆయన అక్కడి స్థానిక, జాతీయ రాజకీయ నాయకులపై గొప్ప ప్రభావాన్ని చూపారు. పెద్ద ఓటింగ్ బ్లాక్ లను తీసుకురాగల అతని సామర్థ్యం అతనికి ఆధ్యాత్మిక రాజుగా పేరు తెచ్చుకుంది. ఎన్నికలలో గెలవడానికి చాలా మంది అతని మద్దతు చాలా అవసరం అని భావించారు. ముఖ్యంగా దావో నగరంలో అతను “న్యూ జెరూసలేం” అని పిలువబడే 75 ఎకరాల భారీ కాంప్లెక్స్‌ను నిర్మించాడు.
Karni Mata Temple: ఆలయంలో 20 వేల ఎలుకలు.. అన్ని ఎందుకున్నయ్యంటే..?
అయితే, అమెరికన్ అలాగే ఫిలిప్పీన్స్ చట్ట అమలు సంస్థల ప్రకారం క్విబోలోయ్ ఆధ్యాత్మిక సామ్రాజ్యం వెనుక ఒక చీకటి నిజం దాగి ఉంది. దీని ప్రభావం కేవలం రాజకీయమే కాదు, విశ్వాసం ముసుగులో బానిసత్వ జీవితంలోకి నెట్టబడిన దుర్బలమైన స్త్రీలు, పిల్లలపై దుర్వినియోగం, తోపాటు లింగిక దోపిడీలు కూడా ఉన్నాయి. 2021లో సెక్స్ ట్రాఫికింగ్, లైంగిక దోపిడీ, కుట్ర, బలవంతపు శ్రమ ఆరోపణలపై యునైటెడ్ స్టేట్స్ క్విబోలాయ్ పై అభియోగాలు మోపింది. ఇక ఈయన అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. 70 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిని తమ గురువుగా భావిస్తారు. ఎంతో గౌరవనీయమైన వ్యక్తిగా భావిస్తారు. అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం సులభం కాదు. గత రెండు వారాలుగా క్విబోలాయ్ ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం పోలీసులు అతని స్థలంలో దాడి చేశారు. అక్కడ అతను బంకర్‌లో దాక్కున్నట్లు తెలుసుకున్నారు.
Car Accident: ఆడి కారుతో ఢీకొట్టి పరారీలోకి వెళ్లిపోయిన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..
క్విబోలాయ్‌ను అరెస్టు చేసేందుకు 2 వేల మందికి పైగా పోలీసులు అతని సామ్రాజ్యాన్ని చుట్టుముట్టారు. అతని స్థలంలో పోలీసులు అతని మద్దతుదారులను ఎదుర్కోవలసి వచ్చింది. వారి కోపాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. మద్దతుదారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. చివరగా, రెండు వారాల పోరాటం తర్వాత ఆయనను అరెస్టు చేసారు. నిజానికి, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అతని కోసం వెతకడానికి పోలీసులు అతని స్థలాన్ని కంటోన్మెంట్‌గా మార్చారు. చివరకు పోలీసులు అతనికి అల్టిమేటం ఇవ్వడంతో స్వయంగా లొంగిపోయారు.