Bigg boss 6: బిగ్ బాస్ షో పై మొదటి నుండీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సీపీఐ నేత నారాయణ ఇటీవల రెండోసారి ఈ సీజన్ కు సంబంధించిన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ఆ వార్తలకు ప్రాధాన్యం లభించడంతో నాగార్జున కూడా మరోసారి బిగ్ బాస్ షోలో ఇన్ డైరెక్ట్ గా నారాయణను విమర్శిస్తూ కామెంట్ చేశారు. శనివారం నాగార్జున హౌస్ లోని ఆర్జే సూర్య, ఆరోహి మధ్య ఉన్న స్నేహబంధం గురించి కాస్తంత లెంగ్తీ చర్చ జరిపారు.
దానికి ముందు శుక్రవారం వీరిద్దరూ ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవడాన్ని కూడా ఆడియెన్స్ కు చూపించి, వారి ఒపీనియన్ అడిగారు. స్నేహానికి మించి వారిమధ్య ఇంకేదో ఉందని వారు కూడా అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోని అందరికీ వీరిద్దరి గురించి చెబుతూ, ముందుగా ఓ పిక్ ను నాగార్జున వదిలాడు. ఆ తర్వాత వీడియోలు కూడా చూపిస్తానంటూ ఆశపెట్టాడు. దాంతో గీతూ… ‘మంచి ఇంట్రెస్టింగ్ వీడియో చూపించ’మని కోరగానే, నాగార్జున ‘నారాయణ నారాయణ… కొందరు ఒప్పుకోరమ్మా’ అంటూ ఇన్ డైరెక్ట్ గా సీపీఐ నారాయణను ఉద్దేశించి అన్నాడు. మొత్తం మీద టామ్ అండ్ జెర్రీ తరహాలో సీపీఐ నారాయణ, నాగార్జున మధ్య సాగుతున్న పరోక్ష మాటల యుద్థం బిగ్ బాస్ షోకు మంచి ప్రచారమే తెచ్చిపెడుతోంది.
Chennakesava Reddy: ఇరవై ఏళ్ళ ‘చెన్నకేశవ రెడ్డి’