NTV Telugu Site icon

Fisher Man: తస్సదియ్యా.. చేపలు పడదామనుకుంటే ఇలా జరిగిందేంటి.. వీడియో వైరల్..

Viral Video

Viral Video

ఇటీవల కాలంలో ఎవరు ఊహించని రీతిలో ఏ ప్రాంతమైనా.., నదిలా ఉన్నా.. చేపలు పట్టే ఘటనలు చోటుచేసుకున్నాయి. వలలలో చేపలకు బదులుగా, వింత జీవులు, కొన్నిసార్లు పాములు, కొండచిలువలు లేదా అరుదైన పెద్ద చేపలు పడుతుండడం గమనిస్తూనే ఉన్నాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ఓ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ వ్యక్తి సమీపంలోని నదిలో చేపలు పట్టడానికి వెళ్లగా.. అక్కడ అనుకోని సంఘటన జరిగింది. నిశితంగా పరిశీలిస్తే… ఆ వ్యక్తి నది ఒడ్డున ప్రశాంతంగా కూర్చుని నీటిలోకి గాలాన్ని వేసాడు. కాసేపు ఎదురుచూడగా ఆ గాలానికి ఓ చేప దొరికింది. అయితే దాన్ని తీయాలని ప్రయత్నించగా.. నీటిలో నల్లటి వస్తువు రావడం గమనించాడు. అతను ఉన్న ఒడ్డుకు ఆ వింత ఆకారం కూడా చాలా స్పీడ్ గా వచ్చింది. దాన్ని చూస్తే అదో పెద్ద మొసలి. ఒడ్డుకు వస్తున్న మొసలిని చూసి మెనూడో పారిపోయాడు. చేపలు, గాలం అన్నీ అక్కడే వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు. మొసలి కాసేపు అతన్ని వెంబడించి.

Also Read: Van Blast: బాంబులా పేలిన మారుతీ వ్యాన్.. భయంతో పరుగులు పెట్టిన ప్రజలు.. వీడియో వైరల్..

అయితే ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌ లో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇక వీడియో చుసిన నెటిజన్ “ఓరిని.. ఇలాంటి పరిణామాలను అస్సలు ఊహించలేదు,” అని కామెంట్ చేయగా., మరొకరు “దాని ఆహారాన్ని దొంగిలిస్తే.. కోపం రాదా అంటూ” కామెంట్ చేస్తున్నారు. ఇంక ఎందుకు ఆలస్యం వైరల్ వీడియోను మీరు కూడా ఓ సారి వీక్షంచండి.