NTV Telugu Site icon

Milk Price Hike: పాలధరలు మరోసారి పెంపు..లీటర్‌పై ఎంతంటే?

Amol1

Amol1

దేశంలో పాల ధరలకు రెక్కలు. ఏడాది కాలంగా పెరుగుతూనే పోతున్న పాల ధరలు మరోసారి పెరిగాయి. వారి పాల ధరను పెంచుతున్నట్టు అమూల్​ సంస్థ ప్రకటించింది. ధరల పెంపు నేటి (ఫిబ్రవరి 3) నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో పాల ధరలు లీటరుకు గరిష్ఠంగా రూ. 3 పెరిగాయి. “అమూల్​ పౌచ్​ మిల్క్​ (అన్ని రకాలు) ధరలను సవరించాం. 2023 ఫిబ్రవరి 3 ఉదయం నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి” అని అమూల్​ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

అమూల్​ పాల ధరలు- ప్రస్తుత రేట్లు.

ప్రాడక్టు                                                      ధర

అమూల్​ తాజా 500ఎంఎల్​                    27
అమూల్​ తాజా 1 లీటరు                         54
అమూల్​ తాజా 2 లీటర్లు                        108
అమూల్​ తాజా 6 లీటర్లు                        524
అమూల్​ తాజా 180ఎంఎల్​                   10
అమూల్​ గోల్డ్​ 500ఎంఎల్​                     33
అమూల్​ గోల్డ్​ 1 లీటర్​                            66
అమూల్​ గోల్డ్​ 6 లీటర్లు                         396
అమూల్​ కౌ మిల్క్​ 500ఎంఎల్​           28
అమూల్​ కౌ మిల్క్​ 1 లీటర్​                   56
అమూల్​ ఏ2 బఫెల్లో మిల్క్​ 500ఎంఎల్​ 35
అమూల్​ ఏ2 బఫెల్లో మిల్క్​ 1 లీటర్​       70
అమూల్​ ఏ2 బఫెల్లో మిల్క్​ 6 లీటర్లు     420

వరుసగా పెరుగుతూ..

పాల ధరలు దేశంలో గత 10 నెలల్లోనే రూ. 12 పెరిగాయి. అంతకుముందు ఏడేళ్ల వరకు పాల ధరల్లో ఒక్క రూపాయి కూడా మార్పు రాలేదు. 2013- 2014 మధ్యలో పాల ధరలు లీటరుకు రూ. 8 పెరిగాయి. ఇక వేసవిలో పాల ఉత్పత్తి ప్రతి ఏటా తగ్గుతుంది. డిమాండ్​ అందుకోవాలంటే.. పాల సంస్థలు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే.. రానున్న రోజుల్లో పాల ధరలు మరింత పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. మరో పాల ఉత్పత్తి సంస్థ మదర్​ డెయిరీ కూడా ధరలను పెంచుతూ వస్తోంది. 2022 మార్చ్​ 5 నుంచి డిసెంబర్​ 27 మధ్యలో ఈ ​ డెయిరీ పాల ధరలు లీటరుకు రూ. 57 నుంచి రూ.66కి చేరాయి. అంటే రూ. 6 పెరిగింది.