NTV Telugu Site icon

Amitabh Bachchan : బిగ్ బీకి అమితంగా నచ్చిన సినిమా.. ఏకంగా 60సార్లు చూశాడట

New Project 2024 10 12t082945.565

New Project 2024 10 12t082945.565

Amitabh Bachchan : బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఓ వెలుగు వెలుగుతున్నారు. ప్రస్తుతం అమితాబ్ వయసు 82 ఏళ్లు. ఇప్పటికీ సినిమాలు, టీవీ రియాల్టీ షోలు, ప్రకటనలతో బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఈరోజు (అక్టోబర్ 11) అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన ‘వెట్టయన్’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయం నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఏడాది ప్రభాస్ నటించిన కల్కి 2898 ADలో కూడా అమితాబ్ కీలక పాత్ర పోషించారు.

బిగ్ బీ అమితాబ్ కెరీర్లో ఎన్నో మరుపురాని చిత్రాలున్నాయి. వాటిలో త్రిశూల్ ఒక‌టి. చేతిలో ఒక్క రూపాయి లేకుండా పట్టణానికి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగిన విజ‌య్ అనే వ్యాపార వేత్త పాత్రలో అమితాబ్ నటన అబ్బురపరిచింది. ప్రేక్ష‌కుల‌కే కాదు అమితాబ్ తో ప‌లు చిత్రాలు నిర్మించిన ఆనంద్ పండిట్ కి కూడా ఈ చిత్రం ఎంత‌గానో నచ్చిందట. అందుకే ఆయ‌న ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ స‌న్నాహాలు చేస్తున్నారు. `త్రిశూల్` ని ఇప్పటి వరకు 60సార్లు చూసి ఉంటాను. ఈ సినిమా క‌థ నాలో ఎంతో స్పూర్తిని నింపింది. అందుకే గుజ‌రాత్ నుంచి ముంబైకి వ‌చ్చాను. ఎప్పటికైనా అమితాబ్ తో త్రిశూల్ సీక్వెల్ చేయాలని నా క‌ల‌` అని అన్నారు. ఈ సీక్వెల్ కు ఆయ‌నే స్వయంగా క‌థ కూడా సిద్దం చేస్తున్నారు. ఆయ‌నే నిర్మిస్తున్నారు. కానీ డైరెక్టర్ గా బాధ్యతలు మాత్రం తీసుకోరు. అత‌డి వివ‌రాలు త్వరలో తెలిసే అవ‌కాశం ఉంది. త్రిశూల్ చిత్రాన్ని యష్ చోప్రా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ సీక్వెల్ ఛాన్స్ ఎవ‌రు? అందుకుంటారు? అనేది మాత్రం చూడాలి. అలాగే ఇప్పుడా సినిమాకి సీక్వెల్ అంటే అమితాబ్ ఆ పాత్రకి సరిపోతారా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. అమితాబ్ యువ‌కుడిగా ఉన్న స‌మ‌యంలో న‌టించిన చిత్రమిది. అప్పట్లో ఆయన వ‌య‌సు 30 ఏళ్ల లోపు ఉంటాయి. క‌ష్టపడి పైకి వ‌చ్చే పాత్రకి కరెక్టుగా సూట్ అయ్యారు. ఇప్పుడు సీక్వెల్ అంటే ఆయ‌న వ‌య‌సును కూడా క‌థ మ్యాచ్ చేయాలి. అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. లేదంటే? మ‌రో పెద్ద నటుడితో చేయాల్సి ఉంటుంది. అయితే పండిట్ అమితాబ్ పేరును క‌ల‌వ‌రిస్తోన్న నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి. అప్పట్లో అమితాబ్ న‌టించిన `జంజీర్` చిత్రం సీక్వెల్ లో రామ్ చ‌ర‌ణ్‌ న‌టించిన సంగ‌తి తెలిసిందే. తుఫాన్ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు కానీ డిజాస్టర్ గా నిలిచింది.

Read Also : Devaragattu Bunny Festival: నేడు దేవరగట్టు కర్రల సమరం.. ఏంటి ప్రత్యేకత..?

Read Also : Dussera 2024: దశమికి జ‌మ్మి చెట్టుకి ఉన్న సంబంధం ఏమిటి..?

Show comments