NTV Telugu Site icon

Amitabh Bachchan : ఫ్యాన్స్ కోరికను తీరుస్తున్న అమితాబ్.. వీడియో వైరల్..

Amitab

Amitab

బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆయనకు సినిమాలు అంటే ఎంత ఇష్టమో.. అభిమానులు అంటే అంత ప్రాణం.. ఇంతవరకు ఏ హీరో చెయ్యని విధంగా ఆయన అభిమానులను కలుస్తూ వారితో గడుపుతారు.. అందుకే ఆయన కోసం అభిమానులు ఎంత సాహసాన్ని అయిన చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు.. అమితాబ్ అంత పెద్ద స్టార్ స్థానంలో ఉన్న అభిమానులను ప్రతి ఆదివారం కలుసుకుంటాడు.. తాజాగా నిన్న అభిమానులను కలిసిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది..

అమితాబ్ బచ్చన్ బహుశా ఏకైక సూపర్ స్టార్..అతనికి అభిమానులు పెరుగుతూనే ఉన్నారు.. తన సినీ కెరీర్‌ని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు సినీ ప్రేమికులచే ప్రేమించబడుతూనే ఉన్నాడు.. అతని మంచి మనుసు వల్లే తన అభిమానులు ముద్దుగా బిగ్ బి అని పిలుచుకుంటారు.. ప్రతి వారం తన ఇంట్లో తన అభిమానులను కలుసుకోవడం ద్వారా ప్రేమను తిరిగి పొందడం కూడా ఒక పాయింట్. ఈ ఆదివారం, బచ్చన్ సీనియర్ తన ముంబై ఇంటి అయిన జల్సా వెలుపల అభిమానులను పలకరిస్తూంటాడు.. ఇలా 41 ఏళ్ల నుంచి అభిమానులను కలుస్తూనే ఉన్నారు..

అమితాబ్ తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియోను పంచుకున్నారు. ట్విట్టర్లో పోస్ట్ చేయబడిన వీడియో, అతని సినిమాల పాత్రల పోస్టర్లు మరియు ఫోటోలను అభిమానుల నుంచి అందుకున్నారు… అతను బయటకు వెళ్లే వరకు వేచి ఉన్న ప్రేక్షకులు నటుడిని ఉత్సాహపరుస్తూ కనిపించారు. అమితాబ్ వెంటనే స్ఫుటమైన తెల్లటి కుర్తా-పైజామాతో తన చుట్టూ శాలువా చుట్టి బయటకు వెళ్లాడు. అందరినీ నమస్తే అంటూ ఆప్యాయంగా పలకరించాడు.. అసలు అమితాబ్ ఎందుకు అభిమానులను చెప్పులు లేకుండా కలుస్తున్నారో కూడా గతంలో వివరించారు.. దేవుడి దగ్గరకు చెప్పులు వేసుకొని వెళ్లరు.. నా అభిమానులే నా దేవుళ్లు అని ఆయనం చెప్పడం అందరిని ఆకట్టుకుంది.. ఎండలో బయట వేచి ఉండేవారి కోసం నాలుగు కంటైనర్లలో తాగునీటిని ఎలా ఏర్పాటు చేశాడో కూడా బిగ్ బి వివరించాడు.. ఇది ఆయన గొప్ప మనసుకు నిదర్శనం అనే చెప్పాలి. ‘ఈ ఎండవేడిమిలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారని నేను భావించాను, అందుకే వారికి దాహం తీర్చడానికి తాగునీరును కూడా ఏర్పాటు చేశారు .. ప్రతి ఆదివారం 4 కంటైనర్లు, 2 గేటుకు ఇరువైపులా ఏర్పాటు కూడా చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు.. ఇక సినిమాల విషయానికొస్తే.. అమితాబ్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 15ని హోస్ట్ చేస్తున్నాడు. అతను తదుపరి ప్రాజెక్ట్ K లో కనిపించనున్నాడు, ఇందులో దీపికా పదుకొనే మరియు ప్రభాస్ కూడా నటించారు..