ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి రోజురోజుకు మారుతుంది. కొద్దీ రోజులుగా ఏపీపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. దానిలో భాగంగా.. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్ర నేతలు రెండు బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. ముందుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శనివారం శ్రీకాళహస్తిలో పర్యటించారు. బీజేపీ మహాసంపర్క్ అభియాన్ సభలో పాల్గొన్నారు.. ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజలకు ఆయన వివరించే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా.. వైసీపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Mrunal Thakur : బ్లాక్ డ్రెస్ లో మతిపోగొడుతున్న మృణాల్..!!
ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ది నిలిచిపోయి.. స్కామ్ లు నడుస్తున్నాయని జేపీ నడ్డా మండిపడ్డారు. అభివృద్దిలో మోడీ దేశాన్ని పరుగులు పెట్టిస్తుంటే.. జగన్ సర్కార్ మాత్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన మండిపడ్డారు. అయితే ఇవాళ ఏపీలో బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. విశాఖ వేదికగా జరగనున్న బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ సభకు ఆయన హాజరుకానున్నారు. రాత్రి 7 గంటలకు పోర్టు గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 8 గంటలకు సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా అమిత్ షా సమావేశం కానున్నారు. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.
Read Also: Pakistan Rains: పాక్లో వర్ష బీభత్సం.. 25 మంది మృతి, 145 మందికి గాయాలు
అయితే.. విశాఖ సభలో అమిత్ షా ఏం మాట్లాడతారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. శ్రీకాళహస్తి సభలో పాల్గొన్న జేపీ నడ్డా.. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దాంతో.. అమిత్ షా ప్రసంగంపైనా అంచనాలు పెరుగుతున్నాయి. విశాఖ సభలో నడ్డా ప్రసంగానికి కొనసాగింపుగా అమిత్‌షా స్పీచ్ ఉంటుందా?.. అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది. వరుసగా ఏపీలో బీజేపీ అగ్రనేతలు పర్యటిస్తుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తులపై అమిత్ షా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో.. విశాఖ సభలో అమిత్ షా ఏం మాట్లాడతారు అనేది వేచి చూడాలి మరి.
Read Also: Kerala News: కాలేజీలో లెక్చరర్ ఫోన్ తీసుకుందని యువతి ఆత్మహత్య
విశాఖపట్నంలో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కంచరపాలెం మెట్టు నుంచి అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డు లో రాకపోకలకు నిషేధం విధించారు. అలాగే తాటిచెట్ల పాలెం నుంచి డీఎల్ఓ జంక్షన్ వరకు వాహనాలకు అనుమతి లేదు అని పోలీసులు తెలిపారు. బహిరంగ సభకు వచ్చే బస్సులు తాటిచెట్లపాలెం 28 బస్ స్టాప్ వద్ద డీఎల్ బీ గ్రౌండ్, విశాఖ పోర్ట్ హస్పటల్ దగ్గర ఉన్న గ్రౌండ్ లో పబ్లిక్ ను దింపి బస్సులు అక్కడే పార్క్ చేసుకునే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. టూవీలర్లకు తాటి చెట్ల పాలెం 28 బస్టాప్ వద్ద పార్కింగ్, ఆటోలు కేంద్రీయ విద్యాలయం వరకు ఉన్న 80 ఫీట్ రోడ్డు మార్జిన్ లో పార్కింగ్ చేయాలి అని పోలీసులు తెలిపారు.