NTV Telugu Site icon

Amit Shah: రాములోరి దర్శనాన్ని రద్దు చేసుకున్న అమిత్ షా.. ఎందుకో తెలుసా..?

Amith

Amith

తెలంగాణలో ఎన్నికల సమర భేరి మోగించేందుకు బీజేపీ సన్నద్ధమైంది. రేపు (ఈ నెల 27న) ఖమ్మంలో పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్‌ షా రేపు (ఆదివారం) ఖమ్మం జిల్లాలో పాల్గొనే బహిరంగ సభకు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం కేసీఆర్‌ చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వడంతో పాటు.. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని షా పూరిస్తారని కమలం పార్టీ నేతలు అంటున్నారు.

Read Also: Skanda Pre Release Event Live: స్కంద ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్

అయితే, అమిత్‌షా తెలంగాణలో పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రేపు భద్రాచలం కార్యక్రమం క్యాన్సిల్ అయింది. దీంతో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం గన్నవరం చేరుకుంటాడు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు షా రానున్నారు. కాగా, ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం.. రేపు మధ్యాహ్నం హెలికాప్టర్‌లో భద్రాచలం చేరుకోవాల్సి ఉంది.. అక్కడ ఆలయంలో సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత హెలికాప్టర్‌లో ఖమ్మంకు చేరుకుని బహిరంగసభలో పాల్గొనేవారు.

Read Also: Adah Sharma: స్టార్ హీరో సూసైడ్ చేసుకున్న ఫ్లాట్ కొనుక్కున్న ఆదా శర్మ?

కానీ, ప్రస్తుతం డైరెక్ట్‌గా ఖమ్మం బహిరంగ సభకే అమిత్ షా వస్తున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్రకోర్‌ కమిటీ, ముఖ్యనేతలతో ఆయన భేటీ అవుతారు. సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఖమ్మం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుని.. అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లిపోతారు. వాస్తవానికి అమిత్‌షా గతనెలలోనే తెలంగాణకు రావాల్సింది. అప్పుడు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆ పర్యటన రద్దు అయింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో అమిత్‌షా సభ నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ రెడీ చేసింది.

Read Also: Mamata Banerjee: మదురై రైలు ప్రమాదంపై దీదీ దిగ్భ్రాంతి

ఇక, ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే.. అమిత్‌షా ప్రసంగం ఎలా ఉండబోతున్నదన్న దానిపై రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరీ ముఖ్యంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే, ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేలా కేసీఆర్‌ సర్కార్ పై అమిత్ షా విమర్శలు చేసే ఛాన్స్ ఉంది. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ విషయంలో బీజేపీ అనుసరించబోయే కఠిన వైఖరి గురించి, అమిత్ షా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.