Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం దట్టమైన పొగమంచు నేపథ్యంలో రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ పైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటన యూపీలోని రాయ్‌బరేలీ జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో టీ స్టాల్ వద్ద నిలబడి ఉన్న 33 నుంచి 74 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. బండా-బహ్రైచ్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి.
IED Blast: పేలిన ఐఈడీ.. ఐదుగురు జవాన్లకు గాయాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీ స్టాల్ వద్ద గుమిగూడిన గ్రామస్తులపై నుంచి ట్రక్కు దూసుకెళ్లి కాలువలో పడింది. మృతులను శివమోహన్ (33), రవీంద్ర (37), సంతోష్ (39), బృందావన్ అలియాస్ గుట్కు (43), లల్లు (54), లాలై (74)లుగా గుర్తించారు. ట్రక్కు కింద మరికొంతమంది చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని గుర్బక్ష్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖగియాఖేడా గ్రామ సమీపంలో ఉదయం 6 గంటలకు బచ్‌రావాన్ నుంచి లాల్‌గంజ్ వైపు ట్రక్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా మేజిస్ట్రేట్ మాల శ్రీవాస్తవ, పోలీసు సూపరింటెండెంట్ అలోక్ ప్రియదర్శి సంఘటనా స్థలాన్ని సందర్శించారు.