Site icon NTV Telugu

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి!

Road Accident

Road Accident

5 Telugu Peoples Died In Texas Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌ నగరంలోని జాన్సన్‌ కౌంటీ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులందరూ ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంకు చెందిన వారు. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులు ఉన్నారు. పొన్నాడ సతీష్‌ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబసభ్యులుగా పోలీసులు గుర్తించారు.

రోడ్డు ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అల్లుడు లోకేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టెక్సాస్‌ నుంచి డల్లాస్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీ కొట్టాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version