Chandragiri Accident: యాక్సిడెంట్ ఎలా జరిగిందో అర్థం కావడం లేదు: అంబులెన్స్ డ్రైవర్
- చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం
- శ్రీవారి భక్తులపైకి దూసుకెళ్లిన 108 వాహనం
- యాక్సిడెంట్ ఎలా జరిగిందో అర్థం కావడం లేదంటున్న డ్రైవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద తిరుమల శ్రీవారి భక్తులపైకి అంబులెన్స్ (108 వాహనం) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ (40), లక్ష్మమ్మ (45)గా గుర్తించారు.
అంబులెన్స్ మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం పేషేంట్‌ను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తనకు అర్థం కావడం లేదని అంబులెన్స్ డ్రైవర్ అమర్ నారాయణ అంటున్నాడు. రోడ్డు ప్రమాదంపై ఎన్టీవీతో అమర్ నారాయణ మాటాడుతూ… ‘అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. హార్ట్ పేషేంట్‌ను తీసుకొని మదనపల్లి నుంచి వస్తున్న సమయంలో ఘటన జరిగింది. రోడ్డుపైన ఒక్కసారిగా వారు ఓ పక్కకు రావడంతో పొగ మంచు కారణంగా నాకు ఏమీ కనపడలేదు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడే చనిపోయారు. గాయపడిన నలుగురిని నేనే స్వయంగా అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లా. ఆస్పత్రి నుంచి చంద్రగిరి స్టేషన్ వచ్చి పోలీసులకు జరిగిన ఘటనను వివరించా’ అని చెప్పాడు.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!