NTV Telugu Site icon

Chandragiri Accident: యాక్సిడెంట్‌ ఎలా జరిగిందో అర్థం కావడం లేదు: అంబులెన్స్‌ డ్రైవర్

Road Accident

Road Accident

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద తిరుమల శ్రీవారి భక్తులపైకి అంబులెన్స్‌ (108 వాహనం) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ (40), లక్ష్మమ్మ (45)గా గుర్తించారు.

అంబులెన్స్‌ మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం పేషేంట్‌ను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తనకు అర్థం కావడం లేదని అంబులెన్స్ డ్రైవర్ అమర్ నారాయణ అంటున్నాడు. రోడ్డు ప్రమాదంపై ఎన్టీవీతో అమర్ నారాయణ మాటాడుతూ… ‘అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. హార్ట్ పేషేంట్‌ను తీసుకొని మదనపల్లి నుంచి వస్తున్న సమయంలో ఘటన జరిగింది. రోడ్డుపైన ఒక్కసారిగా వారు ఓ పక్కకు రావడంతో పొగ మంచు కారణంగా నాకు ఏమీ కనపడలేదు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడే చనిపోయారు. గాయపడిన నలుగురిని నేనే స్వయంగా అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లా. ఆస్పత్రి నుంచి చంద్రగిరి స్టేషన్ వచ్చి పోలీసులకు జరిగిన ఘటనను వివరించా’ అని చెప్పాడు.

Show comments