Site icon NTV Telugu

MLA Kaleru Venkatesh: అంబర్ పేట్ లో రూ. 2.75 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Mla Kaleru

Mla Kaleru

అంబర్ పేట్ నియోజక వర్గంలో పలు అభివృద్ది పనులకు స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శంకుస్థాపన చేశారు. దాదాపు 2.75 కోట్ల రూపాయలతో బాగ్ అంబర్ పేట డివిజన్ రామకృష్ణా నగర్ లోని మోహిన్ చెరువు, స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. ఈ అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

Read Also: Cheese Health Benefits : చీజ్ ను రోజూ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

స్మశాన వాటికలో కొత్త ఆఫీస్ గదులు, షెడ్లు, ప్రాంగణం లోపల సీసీ రోడ్లు, చుట్టూ ప్రహరీ గోడ, మరుగు దొడ్లు, నీటి పైప్ లైన్లు, విద్యుత్ దీపాలు పలు సదుపాయాలు ఉంటాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు పడుతున్న సమస్యలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Exit mobile version