Site icon NTV Telugu

AmberPeta Shankar: ఆ సినిమాలో అంబర్‌పేట శంకర్ యాక్టింగ్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చే…

Amberpeta Shankar

Amberpeta Shankar

సింధూరం సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు ధర్మ. డిసెంబర్ 27 తన రెండో సినిమా “డ్రింకర్ సాయి” విడుదలైంది. ఈ సినిమాలో ఐశ్వర్య శర్మ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ మధ్యకాలంలో ట్రైలర్‌తోనే మంచి హైప్‌ క్రియేట్‌ చేసుకున్న ఈ సినిమాకి కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్‌తోనే ఒక రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసుకుంది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీ మూవీగా తెరకెక్కింది. తాగు బోతు పాత్రలో నటించిన ధర్మకు చాలా మంది కనెక్ట్ అయ్యారు.

READ MORE: Pakistan-Afghanistan: పాకిస్థాన్‌పై తాలిబన్ల భారీ దాడి.. యుద్ధం తప్పదా?

ఈ సినిమాలో ఓ విశేషం ఉంది. ఇందులో అంబర్ పేట శంకర్ నటించారు. అంబర్‌పేట శంకర్ పేరు తెలియని వారు హైదరాబాద్‌లో ఉండరు. కేవలం నగరం వరకు మాత్రమే పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా శంకర్‌కు క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు పలు సినిమాల్లో ఆఫర్లు ఇచ్చినప్పటికీ అంబర్‌పేట శంకర్ తిరస్కరించారు. ఈ మూవీతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనతోపాటు భద్రం, శ్రీకాంత్ అయ్యంగార్ మిగతా పాత్రలు చేసిన వారంతా సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారు.

READ MORE: Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ పర్యటనలో నకిలీ ఐపీఎస్‌.. ఇది వారి బాధ్యతే అన్న డిప్యూటీ సీఎం

ఈ సినిమాలో అంబర్‌పేట శంకర్ వాడిన భాష తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాదీల హృదయాలను తాకింది. స్వచ్ఛమైన తెలంగాణ యాసలో ఆయన మాట్లాడారు. ఆయన చెప్పిన ప్రతిదీ ఓ డైలాగ్‌లా కాకుండా.. సాధారణంగా మాట్లాడినట్లే అనిపిస్తోంది. అయితే.. సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. థియోటర్లలో శంకర్ యాక్టింగ్ చూసిన జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఆయన చెప్పే ప్రతి డైలాగ్‌కు ఫిదా అవుతున్నారు.

Exit mobile version