TDP-BJP-Janasena Alliance: టీడీపీ- బీజేపీ- జనసేన పార్టీలు చిలకలూరుపేటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక, బీజేపీతో పొత్తు ఉన్న టీడీపీకి ఓటు వేస్తే ముస్లింల 4 శాతం పర్సెంట్ రిజర్వేషన్ పోయినట్లే అని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో గందరగోళం చేశారు.. ఒకరిపై ఒకరు దుష్ప్రచారాలు చేసుకొని నీచంగా మాట్లాడుకున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీరి కుమ్ములాటను చూశారు.. వీరి కూటమికి ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు.. చిలకలూరిపేట సభ నుంచి వీరు ప్రజలకు ఏ సందేశం ఇచ్చారు.. చంద్రబాబు అభద్రతాభావంతో ఉన్నాడు.. దేశ ప్రధాని వస్తే మైక్ కూడా సరిగ్గా పని చేయలేదు అంటూ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: PM Modi: దివంగత నేతను గుర్తుచేసుకుని మోడీ భావోద్వేగం
ఇక, ప్రజాగళంలో మైకు మూగబోయింది అదే వారి ఓటమికి సంకేతం అని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ప్రజాగళంలో కుర్చీలు ఖాళీ అయ్యాయి.. పుస్తకాల మీద బ్యాగుల మీద జగన్ బొమ్మలు తీసేయమని అంటున్నారు.. జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారు జగన్ బొమ్మను ఎవరు చెరపలేరు.. ఎన్నికల తర్వాత జూన్ 4వ తేదీన ఫ్యాను గుర్తుకు వచ్చిన ఓట్లు చూసి చంద్రబాబు గుండె ఆగిపోతుంది అని ఆయన ఎద్దేవా చేశారు. 175 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తుంది.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అంతరించిపోయిన పార్టీ.. షర్మిల ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడ రావు అంటూ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.