NTV Telugu Site icon

Ambati Rambabu: అరబ్ దేశాల శిక్షలు, చట్టాలు చెప్పి భయపెడుతున్నారు..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: చంద్రబాబు పులి మీద స్వారీ చేస్తున్నాడని.. ఆ పులి మిమ్మల్నే తింటుందని వైసీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాపై కక్ష్య గట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియాను చిందర వందర చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను అక్రమ అరెస్టు చేశారని విమర్శించారు. సుధారాణి, ఆమె భర్త పక్క రాష్ట్రంలో తల దాచుకుంటే అరెస్టు చేశారన్నారు. ఇప్పుడు వాళ్లను పరామర్శించడానికి మేము వస్తే ఇక్కడి నుండి ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారని అన్నారు. సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెట్టారు అనేది నిర్ణయించేది పోలీసులు కాదు… అందుకు న్యాయస్థానాలు ఉన్నాయన్నారు.

Read Also: Atrocious in Nandyal: దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం

వర్రా రవీంద్రారెడ్డిని, సుధారాణిని అర్ధరాత్రి న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారని.. అర్ధరాత్రి న్యాయమూర్తుల ఇళ్ల వద్ద హాజరు పెట్టాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. పౌర సమాజంలో ప్రజాస్వామ్యం ఉందా అని అడిగారు. కోయా ప్రవీణ్ అనే సీనియర్ పోలీసు అధికారి మాటలు దారుణంగా ఉన్నాయన్నారు. అరబ్ దేశాల శిక్షలు,చట్టాలు చెప్పి భయపెడుతున్నారన్నారు. ఈ అధికారి గతంలో ప్రకాశం జిల్లాలో టీడీపీకి అనుకూలంగా పని చేశారని చెప్పారు. ఐపీఎస్ అధికారులు చట్ట ప్రకారం వ్యవహరించాలని.. మా మీద అసభ్య పోస్టులు పెడితే పోలీసులు ఎందుకు పట్టించుకోరని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

పోలీసు వ్యవస్థ ను కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఖూనీలు చేసే వారిని, దొంగ తనాలు చేసే వారిని కొట్టడమే తప్పు అని చెప్పే ఈ ప్రజాస్వామ్యం లో రాజకీయ కక్ష్యతో పోలీసులు దాడి చేస్తున్నారన్నారు. 2015లో పెట్టిన పోస్టులకు ఇప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. నిజాంబాద్‌లో ఉండే జగన్ అభిమానిని వేధించారన్నారు. తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ బూటు కాలుతో తన్ని , వైఎస్ జగన్‌ను అసహ్యంగా మాట్లాడుతున్నారన్నారు. పోలీసులు ఇంత దిగ జారి ప్రవర్తించాలా అంటూ వ్యాఖ్యానించారు. అరబ్ దేశాలలో అయితే ఇలాంటి పోలీసులకు ఉరి వేస్తారన్నారు. బడ్జెట్‌లో ప్రజలకు ఏం ఒరగ పెట్టలేదు.. సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించింది లేదన్నారు. నాలుగు నెలల్లో వేల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. టీడీపీ నేతలు చేసే పాపాలు డీజీపీకి యజ్ఞాలలా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. పోలీసులకు అంత ఇష్టం ఉంటే రాజకీయాల్లోకి రావచ్చన్నారు.

 

Show comments