Ambani Wedding Rejected : జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన గ్రాండ్ వేడుకలో అనంత్-రాధికలు ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మీడియా కథనాల ప్రకారం ఈ పెళ్లికి దాదాపు రూ. 5,000 కోట్లు ఖర్చు చేశారు. దింతో అనంత్ అంబానీ వివాహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెళ్ళికి ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో భాగంగానే.. పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ కావ్య కర్ణాటకను కూడా అతని పెళ్లికి ఆహ్వానించారు. ఈ పెళ్లిని ప్రమోట్ చేయడానికి తనకు భారీ మొత్తం ఆఫర్ చేశారని అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించానని తాజాగా తెలిపింది.
Brinjals Health Benefits: వయ్యారంగా ఉండే వంకాయలలో ఇంత మ్యాటర్ ఉందా..?
కావ్య తన సోషల్ మీడియా పోస్ట్‌లో., ‘నేను అంబానీ పెళ్లిలో ప్రేక్షకులతో చేరాలని కోరుకోలేదు. అంతేకాకుండా అక్కడికి వెళ్లి నా కంటెంట్ లేదా బ్రాండ్ తో రాజీ పడాలని అనుకోలేదు. జియో ఇంటర్నెట్ ఛార్జీలను పెంచిన తరుణంలో అంబానీ వంటి కార్పొరేట్ దిగ్గజాన్ని ప్రచారం చేయడంలో నేను నిజాయితీగా భావించాను. నా అభిమానులతో నేను నిజాయితీగా ఉండాలి. డబ్బు తీసుకుని ఈ పెళ్లిని ప్రమోట్ చేసి వారి నమ్మకాన్ని భంగపరచాలని అనుకోలేదు. అంబానీ పెళ్లికి హాజరు కావడం నా విలువలకు విరుద్ధం. ఇన్‌ఫ్లుయెన్సర్ గా, కంటెంట్ క్రియేటర్ గా ఇటువంటి ఈవెంట్‌ను ప్రచారం చేయడం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక లాభం కంటే నా చిత్తశుద్ధిని, ప్రేక్షకుల ప్రేమను కాపాడుకోవడం నాకు చాలా ముఖ్యం. పెళ్లిని ప్రమోట్ చేయడానికి నాకు రూ. 3.6 లక్షల ఆఫర్ వచ్చిందని.. దానిని తిరస్కరించడం సులభం కాదు. కానీ., నేను ఆ ఆఫర్‌ను అంగీకరించలేదని తెలిపింది.
Jairam Ramesh: యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా ఓకే.. మరి ఎన్టీఏ చీఫ్ పరిస్థితి ఏంటి..?
అదృష్టవశాత్తూ తన కెరీర్‌లో తనకు నచ్చిన పనిని ఎంచుకునే దశలో ఉన్నానని కావ్య చెప్పింది. కావ్యకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 16 లక్షల మందికి పైగా ఆమెను అనుసరిస్తుండగా.. యూట్యూబ్‌లో ఆమెకు 7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అక్కడ ఆమె భారతదేశంలోని విభిన్న సంస్కృతులను ప్రదర్శించే వీడియోలను చేస్తుంది. కావ్య తన పేరు మీద ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.