Site icon NTV Telugu

Ambajipeta Marriage Band : విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న చిత్ర యూనిట్..

Whatsapp Image 2024 01 21 At 11.40.38 Pm

Whatsapp Image 2024 01 21 At 11.40.38 Pm

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్‌ కలర్ ఫోటో సినిమా తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా సుహాస్ కెరీర్ ను మలుపు తిప్పింది. కలర్ ఫోటో సినిమాతో హీరోగా సుహాస్ తన కెరీర్లోనే బిగ్ హిట్ అందుకున్నాడు. ఆ ఆ తరువాత సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా లో హీరోగా నటించాడు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్’దుశ్యంత్‌ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 02 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా విజయవాడ వెళ్లిన ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్’ టీమ్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. హీరో సుహాస్‌ తో పాటు హీరోయిన్ శివాని నగరం ఆదివారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు ఆశీర్వాదం అందించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ చిత్రయూనిట్‌కు స్వాగతం పలికారు.మ్యూజిక్ బ్యాండ్‌లను నమ్ముకుని బతుకుతున్న కార్మికుల ఇతివృత్తంతో ఈ సినిమా రానుండగా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌ మరియు ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సుహాస్‌ మరోవైపు ఆనందరావ్‌ అడ్వంచర్స్ అనే సినిమా లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్‌ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

Exit mobile version