టాలీవుడ్ యంగ్ హీరో ‘సుహాస్’ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. మూడు రోజుల్లో ఈ మూవీ ఎనిమిది కోట్ల అరవై లక్షల వసూళ్లను దక్కించుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.సోమవారం రోజు కూడా ఈ మూవీ కోటిపైనే కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.. మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ రిలీజైంది. పాజిటివ్ టాక్ కారణంగా ఫస్ట్ వీకెండ్‌లోనే ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. ఈ శుక్రవారం ఈగల్ మరియు లాల్‌సలాం రిలీజ్ కానున్నాయి. అప్పటివరకు థియేటర్లలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకు తిరుగు ఉండదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు ఆహా ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. థియేటర్లలో రిలీజైన నాలుగు నుంచి ఐదు వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి ఈ మూవీ రాబోతున్నట్లు తెలిసింది.అంటే మార్చి 8 లేదా మార్చి 15న ఆహా ఓటీటీలో అంబాజీపేట మ్యారేజి బ్యాండు రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.. మార్చి ఫస్ట్ వీక్‌లో అంబాజీపేట మ్యారిజి బ్యాండు ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో దుష్యంత్ కటికనేని దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కులవివక్షకు లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో మల్లి అనే నిమ్న వర్గానికి చెందిన యువకుడిగా సుహాన్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. మల్లి (సుహాస్) అంబాజిపేట మ్యారేజి బ్యాండులో సభ్యుడిగా పనిచేస్తుంటాడు. అతడి కవల సోదరి పద్మ (శరణ్య ప్రదీప్) ఊరిలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తుంటుంది.స్కూల్ విషయంలో ఊరిపెద్దగా చెలామణి అవుతోన్న వెంకట్‌బాబుతో (నితిన్ ప్రసన్న) పద్మ గొడవపడుతుంది. ఆ గొడవ కారణంగా పద్మ జీవితం ఏమైంది. అక్కకు జరిగిన అన్యాయంపై మల్లి ఎలాంటి పోరాటం చేశాడు. మల్లిని ప్రేమించిన వెంకట్‌బాబు చెల్లెలు లక్ష్మి పెద్దలను ఎదురించి అతడిని పెళ్లి చేసుకుందా..లేదా.? అన్నదే అంబాజీ పేట మ్యారేజి బ్యాండు మూవీ కథ. ఇందులో సుహాస్ సోదరిగా శరణ్య ప్రదీప్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.ఈ మూవీలో శివాని నాగరం హీరోయిన్‌గా నటించింది. శేఖర్ చంద్ర మ్యూజిక్ ను అందించారు