టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ ఫిబ్రవరి 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో దుశ్యంత్ దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కుల వివక్షతకు లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి దుశ్యంత్ ఈ మూవీని తెరకెక్కించాడు. సినిమా చూసిన ప్రేక్షకులు, క్రిటిక్స్ దర్శకుడు దుశ్యంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు . ఈ మూవీలో సుహాస్ సరసన శివానీ నాగరం హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో సుహాస్ అక్కగా నటించిన శరణ్య ప్రదీప్ తన పర్ఫార్మెన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ కోసం అమలాపురంలోని లూటుకుర్రు అనే చిన్న గ్రామంలో సెట్ వేశారు. సినిమాలోని చాలా భాగం అక్కడే చిత్రీకరించారు.
ప్రస్తుతం ప్రమోషన్స్లో బిజీగా ఉన్న మూవీ టీమ్.అందులో భాగంగానే ఆ ఊరు కోసం ప్రత్యేకంగా ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నారు. లూటుకుర్రులోనే స్ట్రీట్ సెట్, బ్యాండ్ ఆఫీస్ సెట్, సెలూన్ షాప్ సెట్ ఏర్పాటు చేసి దాదాపు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా మొత్తం అక్కడే చిత్రీకరించారు.. దీంతో ఆ ఊరి ప్రజలంతా షూటింగ్ కి చాలా సాయం చేశారని చెప్పుకొచ్చారు.. అందుకే ఊరి ప్రజలందరికీ ఘనంగా విందు ఏర్పాటు చేయాలని నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందులో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ టీమ్ మొత్తం పాల్గొనున్నట్టు తెలుస్తోంది. మామూలుగా మేకర్స్ సినిమా షూటింగ్స్ కోసం ఇలాంటి పల్లెటూళ్లను ఎంపిక చేసుకుంటారు. కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్లీ ఆ ఊళ్లకు తిరిగి వెళ్లడం అనేది అయితే జరగదు. కానీ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ టీమ్ మాత్రం తాము షూటింగ్ చేసిన ఊరి ప్రజల కోసం విందు ఏర్పాటు చేయడం మంచి విషయమని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
