NTV Telugu Site icon

Pawan Kalyan: వీరమల్లు డేట్ ఫిక్స్ చేసిన అమెజాన్.. త్వరలో అధికారిక ప్రకటన!

Harihara Veeramallu

Harihara Veeramallu

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ వీడియో లేకపోతే, నిజానికి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కావలసి ఉంది. కానీ, షూటింగ్ పూర్తయిన వెంటనే రిలీజ్ చేయలేని పరిస్థితుల్లో సినిమా రిలీజ్ కావడం లేదు. అయితే, ఈ సినిమాను మే 3వ తేదీన రిలీజ్ చేయొచ్చని అంచనాలు ఉన్నాయి. కానీ, బుక్ మై షోలో జూన్ 12వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నట్లు అప్పుడే పోస్టర్ పెట్టేశారు. దీంతో అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై క్లారిటీ లేదు, ఎందుకంటే సినిమా యూనిట్ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

Read More: Rajamouli : సైనికుల కదలికల గురించి పోస్టు చేయొద్దు.. రాజమౌళి రిక్వెస్ట్

తాజాగా అందిన సమాచారం మేరకు, ఈ సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ సంస్థ సినిమా నిర్మాత ఏ.ఎం. రత్నంతో తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి, ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ముంబై వెళ్లి సినిమా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని రత్నం ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్‌తో మాట్లాడిన తర్వాత, జూన్ 12న సినిమా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. క్రిష్ మొదలుపెట్టిన ఈ సినిమాను జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. కీరవాణి అందిస్తున్న సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది.