NTV Telugu Site icon

Amazon Prime Day Sale 2023: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్!

Amazon Prime Day Sale 2023 Offers

Amazon Prime Day Sale 2023 Offers

Smartphones Discounts on Amazon Prime Day Sale 2023: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ తమ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ మెంబర్స్ కోసం ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ తీసుకొస్తోంది. ఈ సేల్ జూలై 15, 16 తేదీల్లో భారతదేశంలో జరగనుంది. రెండు రోజుల పాటు సోనసాగే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ లభించనుంది. బ్యాంక్ ఆఫర్‌లను మినహాయించి స్మార్ట్‌ఫోన్ కేటగిరీకి 40 శాతం వరకు తగ్గింపు ఉంది. వన్‌ప్లస్ నార్డ్‌ 3 (OnePlus Nord 3), ఐకూ నియో 7 ప్రో (iQOO Neo 7 Pro), రియల్‌మీ నార్జో 60 (Realme Narzo 60), మోటోరొలా రేజర్‌ 40 అల్ట్రా (Motorola Razr 40 Ultra)తో సహా మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపుతో లభించనున్నాయి.

OnePlus Nord 3 Price:
వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ. 33,999. ఐసీఐసీఐ బ్యాంక్ లేదా ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లను కలిగి ఉన్న వారు 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అప్పుడు ఈ ఫోన్ మాకు రూ. 32,999కి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 SoC ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్ మరియు 120Hz డిస్‌ప్లే, 6.74 అంగుళాల పరిమాణంలో ఉంటుంది.

Motorola Razr 40 Ultra:
మోటోరొలా రేజర్‌ 40 అల్ట్రా కూడా ప్రైమ్ సేల్ 2023లో విక్రయించనుంది. రూ. 89,999 ధర ఉన్న ఈ ఫోన్.. రూ. 82,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది అల్ట్రా స్లిమ్మెస్ట్ ఫ్లిప్ ఫోల్డింగ్ ఫోన్‌లలో ఒకటి. ఇది అతిపెద్ద కవర్ డిస్‌ప్లే (3.6 అంగుళాలు)తో వస్తుంది. ఈ ఫోన్ మడతపెట్టినప్పుడు కూడా పూర్తిగా పనిచేస్తుంది.

Also Read: Amazon Prime Day Sale 2023: ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’.. ఈ క్రెడిట్ కార్డుపై భారీ క్యాష్‌బ్యాక్!

iQOO Neo 7 Pro:
కొత్త స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ఆధారిత ఐకూ నియో 7 ప్రో ధర రూ. 33,999. అయితే ప్రైమ్ డే సేల్‌లో ఈ ఫోన్ రూ. 31,999కి అందుబాటులో ఉంటుంది. ఇందులో 50MP OIS కెమెరా, 6.78-అంగుళాల ఫుల్‌హెచ్‌డి+ అమోలెడ్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ Gen 1 చిప్‌సెట్ ఉంటుంది. 120W ఫ్లాష్‌ఛార్జ్‌కు ఇది సపోర్టు ఇస్తుంది.5,000mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 30 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది.

Realme Narzo 60:
రియల్‌మీ నార్జో 60 ఫోన్ 1TB స్టోరేజీ, 12GB RAMని కలిగి ఉంటుంది. ప్రైమ్ డే సేల్‌లో ఈ ఫోన్ రూ. 23,999కి బదులుగా రూ. 22,499కి కొనుగోలు చేయొచ్చు. ఇందులో 100MP OIS రెడీ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో వినియోగదారులు 2,50,000 కంటే ఎక్కువ ఫోటోలను సేవ్ చేసుకోవచ్చు. రియల్‌మీ నార్జో ఎన్53ని రూ 8,999కి.. శాంసంగ్‌ గెలాక్సీ ఎం 13ని రూ 9,699కి అందుబాటులో ఉన్నాయి.

Also Read: Amazon Prime Day Sale 2023: ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’.. ఈ క్రెడిట్ కార్డుపై భారీ క్యాష్‌బ్యాక్!