Amazon Great Indian Festival Sale: ఇంటికి పెద్ద స్మార్ట్ టీవీ కొందామని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! తక్కువ బడ్జెట్లోనే మీ ఇల్లు థియేటర్‌లా మారిపోయే సూపర్ ఆఫర్లు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. అమెజాన్ ఇండియాలో త్వరలో ప్రారంభం కానున్న ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’తో పాటు ఫ్లిప్‌కార్ట్ సేల్ కూడా అక్టోబర్ 8వ తేదీ నుంచి షురూ కాబోతోంది. ఈ సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్ల నుంచి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతి ఒక్కటీ చాలా తక్కువ ధరలకే లభించనున్నాయి. ముఖ్యంగా అమెజాన్ సేల్‌లో స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై ఏకంగా 65 శాతం వరకు భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
సాధారణంగా ఇంట్లో పెద్ద స్క్రీన్ అనుభూతి కోసం 100 అంగుళాల స్మార్ట్ టీవీ కొనాలంటే లక్ష రూపాయలకు పైగానే ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత బడ్జెట్ లేకపోయినా బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఎన్నో కాంపాక్ట్ మిని ప్రొజెక్టర్లు అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ సేల్‌లో లభించే ఆఫర్ల ద్వారా కేవలం రూ.6,000 ధరలోనే ప్రొజెక్టర్ పొంది, ఏకంగా 200 అంగుళాల పెద్ద ‘స్మార్ట్ టీవీ’ స్క్రీన్ అనుభూతిని హ్యాపీగా ఆస్వాదించవచ్చు. ఈ మిని ప్రొజెక్టర్ సాయంతో ఇంట్లోని ఏ తెల్లటి గోడనైనా లేదా తెల్లటి తెరనైనా క్షణాల్లో స్మార్ట్ టీవీ స్క్రీన్‌లా మార్చేయవచ్చు. అవసరాన్ని బట్టి 32 అంగుళాల నుంచి ఏకంగా 200 అంగుళాల వరకు ఎంత పెద్ద స్క్రీన్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. పైగా ఇప్పటి ఆధునిక మిని ప్రొజెక్టర్లు మంచి బ్రైట్‌నెస్‌తో వస్తున్నాయి. పరిమాణంలో చాలా చిన్నవిగా, పోర్టబుల్‌గా ఉండటం వల్ల వీటిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు, మనకు నచ్చిన చోట పెట్టుకుని వాడేయవచ్చు. అయితే కొత్తగా మిని ప్రొజెక్టర్ కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను మనసులో ఉంచుకోవడం మంచిది. ప్రొజెక్టర్‌లోని ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, అందులో ఏయే యాప్స్ ముందే ఇన్‌స్టాల్ చేసి ఉన్నాయో చూసుకోవాలి. అలాగే ప్రొజెక్టర్‌కి వైఫై (WiFi), బ్లూటూత్, HDMI పోర్టుల లాంటి కనెక్టివిటీ ఆప్షన్లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇవి ఉన్నప్పుడే ప్రొజెక్టర్ వాడటం చాలా తేలికగా, మెరుగైన అనుభూతిని అందిస్తుంది.

