Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Great Indian Festival: స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేసేవారికి బెస్ట్ టైం వచ్చేసింది.. Amazon Great Indian Festival 2026 సేల్‌లో రూ.20,000 లోపు బడ్జెట్‌తో కొత్త ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. iQOO, Redmi, OnePlus, Samsung వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన పలు స్మార్ట్ఫోన్లు డిస్కౌంట్ ధరలకు అందుబాటులో వస్తున్నాయి.. వీటితో పాటు బ్యాంక్ ఆఫర్లు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, కూపన్ ఆఫర్లను ఉపయోగించుకుంటే మరింత తక్కువ ధరకు ఫోన్ సొంతం చేసుకోవచ్చు..
రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే!
1. iQOO Z11 Lite 5G
iQOO Z11 Lite 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.33,999 కాగా, సేల్‌లో రూ.19,497కు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. పనితీరు, ధర మధ్య సమతుల్యత కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక ఎంపికగా నిలవవచ్చు.
Also Read
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
2. Redmi A7 Pro 5G
Redmi A7 Pro 5G ఫోన్ అసలు ధర రూ.26,999 కాగా, ప్రస్తుతం రూ.14,497కు సొంతం చేసుకోవచ్చు.. రూ.15 వేల లోపు బడ్జెట్లో 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారు ఈ డీల్‌ను పరిశీలించవచ్చు.
3. OnePlus N6x
OnePlus N6x స్మార్ట్‌ఫోన్ ధర రూ.29,999 నుంచి రూ.19,999కు తగ్గినట్లు పేర్కొన్నారు. రూ.20 వేల లోపు బడ్జెట్లో OnePlus ఫోన్ కోసం చూస్తున్నవారికి ఇది మరో ఎంపిక.
4. Samsung Galaxy M17e 5G
Samsung Galaxy M17e 5G ఫోన్ అసలు ధర రూ.19,999 కాగా, సేల్‌లో రూ.16,998కు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. సాఫ్ట్వేర్ అనుభవం, డిస్ప్లేకు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులు ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలించవచ్చు.
5. OnePlus N6 Lite
OnePlus N6 Lite స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.24,999 కాగా, సేల్ ధర రూ.15,999గా పేర్కొన్నారు. తక్కువ బడ్జెట్లో OnePlus బ్రాండ్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది పరిశీలించదగిన డీల్.
6. Redmi 15C 5G Prime Edition
Redmi 15C 5G Prime Edition ఫోన్ అసలు ధర రూ.29,999 కాగా, సేల్‌లో రూ.15,999కు లభిస్తున్నట్లు సమాచారం. తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్ కోరుకునేవారు ఈ మోడల్‌ను కూడా పరిశీలించవచ్చు.
SBI కార్డులతో మరిన్ని డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి..
Amazon Great Indian Festival సేల్‌లో స్మార్ట్ఫోన్లపై ప్రకటించిన ధరలతో పాటు అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉండవచ్చు. SBI క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.. అయితే, ఈ ఆఫర్‌కు సంబంధించిన నిబంధనలు, అర్హతలను కొనుగోలు చేసే ముందు తనిఖీ చేయడం మంచిది.. అలాగే, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఎంపిక చేసిన ఫోన్లపై అదనపు కూపన్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI సదుపాయం, Amazon Pay ద్వారా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉండవచ్చు. అయితే, అన్ని ఆఫర్లు ప్రతి ఫోన్‌కు వర్తించకపోవచ్చు.
ఫోన్ కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
సేల్‌లో కనిపించే ధరే మీరు చెల్లించే తుది ధర అని భావించకూడదు. బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు వర్తించిన తర్వాతే తుది ధర తెలుస్తుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువ దాని మోడల్, పరిస్థితి, ఇతర నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. అలాగే, ఫోన్ కొనుగోలు చేసే ముందు దాని ఫీచర్లు, స్టోరేజ్ వేరియంట్, వారంటీ, డెలివరీ వివరాలు, అందుబాటులో ఉన్న స్టాక్‌ను పరిశీలించాలి. అసలు ధరగా చూపిస్తున్న మొత్తాన్ని మాత్రమే ఆధారంగా చేసుకోకుండా, ఇతర విక్రయదారుల ధరలతో పోల్చడం మంచిది. ఆఫర్లకు సంబంధించిన నిబంధనలను పూర్తిగా చదివిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకుంటే బెస్ట్ డీల్ తీసుకోవచ్చు..
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!