Site icon NTV Telugu

Chandrababu : సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాం

Untitled Design (1)

Untitled Design (1)

అమరావతిలో మంత్రులతో భేటీ నిర్వహించారు సీఎం చంద్రబాబునాయుడు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉన్నందుకు తనను టార్గెట్ చేస్తున్నారన్నారు డిప్యూడీ సీఎం పవన్ కళ్యాణ్. స్వార్థ రాజకీయాల కోసం చేసే విషప్రచారాన్ని ధీటుగా తిప్పికొడదామని పవన్ అన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారంపైనా కేబినెట్ భేటీ తర్వాత.. మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు . ఎరువులకు ఇబ్బంది లేకున్నా.. వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేదని సీఎం చంద్రబాబు.. మంత్రలపై అసహనం వ్యక్తం చేశారు. ఇకనుంచి ఇలాంటి దుష్ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన మంత్రులను హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టులకు ఆధార్ అకౌంటబిలిటీ ఉండేలా చట్టం ఉండాలనే అంశంపై చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు.

Exit mobile version