Site icon NTV Telugu

Bopparaju Venkateswarlu: ఉద్యోగులపై ఒత్తిడి పెరిగింది.. ప్లీనరీలో చర్చిస్తాం

Bopparaju

Bopparaju

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిందన్నారు అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం అయ్యామని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించాం అన్నారు. నవంబర్ 27న ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ ప్లీనరీ నిర్వహిస్తున్నాం. సచివాలయం ఉద్యోగుల మీద విపరీతమైన పని ఒత్తిడి తెస్తున్నారు. దురదృష్టవశాత్తు నిన్న ఓ ఉద్యోగి పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

గతంలో ఓ చోట సర్వేయర్ ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా మంది ఉద్యోగుల పని ఒత్తిడి కి గురవుతున్నారు.. ప్రతీ విషయంలో గ్రామ, వార్డు ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. చట్టప్రకారం పని చేయించాలి కానీ వత్తిడి తెచ్చి పని చేయించడం సరికాదన్నారు బొప్పరాజు. ఒత్తిడి చేసి పని చేయించుకొనే వారు ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదు.

Read Also:
TS Group 1 Exam : 45 రోజుల పసిపాపతో గ్రూప్‌ 1 పరీక్షకు ఓ మహిళ.. తల్లి పరీక్ష రాస్తుంటే.. పాప ఆకలితో ఏడుస్తూ..
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ చేయకుండా ఏడాదిపాటు కాలయాపన చేశారు. డిసెంబర్ 2020 రెండో నోటిఫికేషన్ ద్వారా కొంతమంది ఉద్యోగులలో చేరారు. వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం. నవంబర్ 27న విజయవాడలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నాం. ఆరోజే నూతన కమిటీని ప్రకటిస్తాం అన్నారు అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.

Read Also: Katragadda Murari: మురారి… సంగీత సాహిత్యాభిమాన‌ విహారి!

Exit mobile version