Site icon NTV Telugu

Amaravati Model Gallery: అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు..

Amaravati Model Gallery

Amaravati Model Gallery

Amaravati Model Gallery: అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో.. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో నమూనా గ్యాలరీని ఏర్పాటు చేశారు అధికారులు. అయితే, దుండగులు ఆ నమూనా గ్యాలరీను పగలగొట్టారు.. అమరావతి ముఖచిత్రం, చారిత్రక ఘట్టాలు, మ్యాప్‌లు, కట్టడాలకు సంబంధించిన నమూనాలు, విశేషాలను తెలిపేలా బోర్డులను రూపొందించగా.. వాటిని దుండగులు ధ్వంసం చేశారు.. అయితే, నమూనాలను దుండగులు ధ్వంసం చేసిన తర్వాత స్థానిక రైతులు గుర్తించారు.. అమరావతి ముఖచిత్రం, చారిత్రక ఘట్టాలు, మ్యాప్‌లు, కట్టడాలకు సంబంధించిన నమూనాలు, విశేషాలను తెలిపే బోర్డులు ధ్వంసం చేయడం ఏంటి ? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని.. రాజధాని కోసం శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆ నమూనాలను ధ్వంసం చేయడం ఏంటి అని మండిపడుతున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

Exit mobile version