Site icon NTV Telugu

Amaran : రికార్డు ధరకు సేల్ అయిన అమరన్ ఓటీటీ రైట్స్..?

Whatsapp Image 2024 03 07 At 12.32.11 Pm

Whatsapp Image 2024 03 07 At 12.32.11 Pm

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్‌, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అమరన్.. యాక్షన్ వార్ డ్రామా గా తెరకెక్కుతోన్న అమరన్ సినిమాకు విలక్షణ నటుడు కమల్‌హాసన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోనీ పిక్చర్స్‌తో కలిసి కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళనాడుకు చెందిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా అమరన్ మూవీ తెరకెక్కుతోంది. ముకుంద్ వరదరాజన్ జీవితంపై ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ పేరుతో ఓ బుక్ ప్రచురితమైంది. ఆ బుక్‌లోని అంశాలతో అమరన్ మూవీని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియాసామి రూపొందిస్తోన్నాడు. 2014లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముకుంద్ మరణించాడు..అమరన్ సినిమాలో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ కనిపించనుండగా…అతడి భార్య రెబెకా వర్గీస్ పాత్రలో సాయిపల్లవి నటిస్తుంది. ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో సాయి పల్లవి కనిపించనుంది.

ఇదిలా ఉంటే మూవీ షూటింగ్ కూడా పూర్తికాకముందే ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. రికార్డు ధరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది.55 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ పోటీపడ్డట్లు తెలుస్తుంది.చివరకు నెట్‌ఫ్లిక్స్ భారీ రేట్‌కు హక్కులను సొంతం చేసుకున్నదని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. శివకార్తికేయన్‌తో పాటు సాయిపల్లవి కెరీర్‌లో అత్యధిక ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా అమరన్ నిలిచింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం మరియు హిందీ హక్కులు మొత్తం నెట్‌ఫ్లిక్స్ కే దక్కినట్లు సమాచారం.దాదాపు 150 కోట్ల బట్జెట్‌తో అమరన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం శివకార్తికేయన్ 30 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. సాయిపల్లవి పది కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం..ఈ సినిమాను నిర్మిస్తూనే ఇందులో ఓ గెస్ట్ రోల్ కమల్‌హాసన్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమరన్ సినిమాలో రాహుల్ బోస్‌ మరియు భువన్ అరోరా కీలక పాత్రలు పోషిస్తున్నారు

Exit mobile version