Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ బస్సు చిత్తూరు జిల్లాకు చెందిగా చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది! మృతుల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘాట్‌రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. క్షతగాత్రులు ఆహాకారాలు చేస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలిసలు, అంబులెన్సులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన బస్సులో ప్రయాణికులు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. ఇంకా సంఖ్య బయటకు రాలేదు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, స్థానికులు బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకొని అన్నవరానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
READ MORE: Vemulawada: గుండెపోటుతో మృతి చెందిన అభ్యర్థి సర్పంచిగా గెలుపు.. ఇప్పుడు ఎలా మరీ..?
