NTV Telugu Site icon

Allu Arjun : 10 కోట్ల ఆఫర్ ను రిజెక్ట్ చేసిన ఐకాన్ స్టార్..?

Allu Arjun

Allu Arjun

Allu Arjun :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది.దర్శకుడు సుకుమార్ పుష్ప మూవీ కంటే భారీగా పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు.పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ నేషనల్ వైడ్ గా ఎంతగానో పాపులర్ అయ్యారు.

Read Also :Indian 2 : నేడే గ్రాండ్ ఆడియో లాంచ్ …స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్న చిత్ర యూనిట్..

అల్లుఅర్జున్ పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అవార్డు కూడా అందుకున్నాడు.పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ బాడీ లాంగ్వేజ్ హిందీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.పుష్ప 2 కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు వచ్చిన క్రేజ్ ను కాష్ చేసుకునేందుకు పలు వాణిజ్య సంస్థలు అల్లుఅర్జున్ తో యాడ్స్ చేసేందుకు పోటీ పడుతున్నాయి.తాజాగా అల్లుఅర్జున్ ఒక యాడ్ చేయనని తెగేసి చెప్పేశారట.ఆ యాడ్ లో నిమిషం నటిస్తే ఏకంగా 10 కోట్లు ఆఫర్ చేశారట.కానీ అల్లుఅర్జున్ ఒప్పుకోలేదని సమాచారం.అయితే ఆ యాడ్ టుబాకోకి సంబంధించింది కావడంతో అల్లుఅర్జున్ నటించడానికి ఒప్పుకోలేదని సమాచారం.

Show comments