Site icon NTV Telugu

Allu Sirish Marriage: ఒకటైన అల్లు శిరీష్ – నయనిక.. వెడ్డింగ్ ఫోటోలు వైరల్!

Allu Sirish Marriage Photos

Allu Sirish Marriage Photos

అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. ఇరు కుటుంభాల సమక్షంలో పెద్దల అంగీకారంతో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని కొల్లూరులో ఉన్న ‘ఐనా ఈవెంట్ స్పేస్’ (Aina Event Space) లో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. చిత్రమేమిటంటే, సరిగ్గా 15 ఏళ్ల క్రితం (2011) ఇదే రోజున అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి వివాహం జరిగింది. ఇప్పుడు అదే తేదీన శిరీష్ కూడా పెళ్లి చేసుకోవడం విశేషం. అల్లు అర్జున్ తన 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రోజే తమ్ముడి పెళ్లి కూడా జరగడంతో అల్లు కుటుంబంలో ఆనందం రెట్టింపైంది.

నయనిక రెడ్డి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన యువతి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) లో చదువుకున్న ఆమె, ప్రస్తుతం సొంతంగా బిజినెస్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ 2023లో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకల్లో మొదటిసారి కలుసుకున్నారు. అది కాస్తా ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరింది. కాగా ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఉపాసన, తమిళ స్టార్ హీరో సూర్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లిలో శిరీష్ క్లాసిక్ వైట్ సిల్క్ కుర్తాలో మెరవగా, నయనిక లావెండర్ అండ్ గోల్డ్ సిల్క్ చీరలో అప్సరసలా మెరిసిపోయారు.

Exit mobile version